రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న చైతూ మ్యూజికల్ బ్లాక్ బాస్టర్..ఆ రికార్డ్స్ చూశారా?

ఈ సందర్భంగా నాగచైతన్య ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ.. "లవ్ స్టోరీ సినిమా నా మనసుకు దగ్గరైన చిత్రం. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 14వ తేదీన మళ్లీ విడుదల కాబోతోంది.;

Update: 2026-01-22 16:53 GMT

గత 2, 3 సంవత్సరాలుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అభిమాన హీరోలకు సంబంధించిన స్పెషల్ అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు లేదా మరేదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఆయా సందర్భాలలో ఆయా హీరోల కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలచిన చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసి సందడి చేస్తున్నారు అభిమానులు. అలా మహేష్ బాబు 'పోకిరి' సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ మరింత జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెల రాబోతున్న నేపథ్యంలో ప్రేమికుల రోజు సందర్భంగా కొన్ని కొత్త సినిమాలు విడుదల అవుతుండగా.. మరికొన్ని రీ రిలీజ్ అవుతున్నాయి.




 


అందులో భాగంగానే ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో మెప్పించడానికి కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ 'లవ్ స్టోరీ' రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాసు నారంగ్, పి రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. 2020 ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడి.. 2021 సెప్టెంబర్ 24న విడుదల అయింది. ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ లవ్ స్టోరీ మూవీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.

అలాంటి ఈ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 14వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ.. "లవ్ స్టోరీ సినిమా నా మనసుకు దగ్గరైన చిత్రం. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 14వ తేదీన మళ్లీ విడుదల కాబోతోంది. మరోసారి మీ అందరితో కలిసి ఈ సినిమాను థియేటర్లలో సెలబ్రేట్ చేసుకుందాం" అంటూ పోస్ట్ చేశారు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

మరోవైపు లవ్ స్టోరీ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల గ్రాస్ వసూలు సాధించి పోస్ట్ కోవిడ్ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అలాగే అమెరికాలో వన్ మిలియన్ డాలర్ మార్క్ అధిగమించి రికార్డు సృష్టించింది. కరోనా తర్వాత థియేటర్లు తిరిగి తెరవబడినప్పుడు అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 10.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది . ఒకరకంగా చెప్పాలి అంటే కరోనా సమయంలో ఇది చాలా పెద్ద కలెక్షన్. ఈ సినిమా విడుదలైన 16వ రోజు కూడా అత్యధిక కలెక్షన్ల సాధించి రికార్డు సృష్టించింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ అవుతోంది. మరి ఇప్పుడు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ తండేల్ సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News