ఇండస్ట్రీలో ఆయన ఒంటరయ్యాడా?
ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఫాంలో ఉన్నంత కాలం తిరుగుండదు. అవకాశం కావాలంటూ హీరోలొస్తారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటూ నిర్మాతలు సూట్ కేసులు పట్టుకుని రెడీగా ఉంటారు.;
ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఫాంలో ఉన్నంత కాలం తిరుగుండదు. అవకాశం కావాలంటూ హీరోలొస్తారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటూ నిర్మాతలు సూట్ కేసులు పట్టుకుని రెడీగా ఉంటారు. ఇంకా ఇతర శాఖలకు సంబంధించిన వారంతా డైరెక్టర్ చుట్టూ తిరుగుతారు. నిత్యం ఆ సినిమా ఆఫీస్ కళాకారులు..టె క్నిషీయన్లు...నిర్మాతలు..ఆఫీస్ స్టాప్ తో కళకళలాడుతుంది. కానీ సక్సెస్ ల్లో ఉన్న ఓ స్టార్ డైరెక్టర్ ఆఫీస్ మాత్రం ఎప్పుడూ వెల వెలబోతుంది.
ఇండస్ట్రీలో ఎన్నో హిట్లు ఇచ్చినా? చరిత్రలు తెరకెక్కించిన ఘనత ఉన్నా? అతడు ఇండస్ట్రీలో ఒంటరి వాడు అయినట్లే కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలు గా తన సినిమాలన్నీ స్వీయా దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు...నిర్మాత ఆయనే. బేసిక్ ఆయన ట్యాలెంటెడ్. ఇతర రైటర్లపై ఆధారపడరు. తన కథలు తానే రాసుకుంటారు. డైలాగ్..అవసరం మేర స్క్రీన్ ప్లే కోసం కొంత మంది సన్నిహిత రైటర్ల సహకారం మాత్రమే తీసుకుంటారు.
ఇది చాలా కాలంగా చేస్తోన్న పనే. పదేళ్ల క్రితం బయట బ్యానర్లలోనే ఎక్కువగా సినిమాలు చేసేవారు. కానీ ఆ తర్వాత సొంత సంస్థలోనే నిర్మించడం మొదలు పెట్టారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. ఆయన పిలిస్తే ఎంతో మంది నిర్మాతలొచ్చి పెట్టుబడి పెడతారు. కానీ ఎందుకనో ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. కష్టమైనా.. నష్టమైనా ఆయనే భరిస్తున్నాడు. అయితే ఆయన తీసిన సినిమాలు భారీ బడ్జెట్ కావడంతో కొంత నష్టం కూడా ఎదురైంది.
అలాగని ఆయన వెనక్కి తగ్గలేదు. తన ప్రయత్నాలు తానే చేస్తున్నాడు. తానే సొంతం గా సినిమాలు నిర్మిస్తున్నారు. నష్టాల్లో ఉన్నా? పోస్టర్ పై దర్శక, నిర్మాతగా ఆయన పేరే పడుతుంది. అదే ఆయన గొప్పతనం. అయితే వ్యక్తిగతంగా ఆ డైరెక్టర్ ఏ హీరోని ఛాన్సులు అడగరని..తనకి బాగా తెలిసిన నటు లతో...సాన్నిహిత్య ఉంటే తప్ప పనిచేసే డైరెక్టర్ కాదు. సదరు డైరెక్టర్ కు కోపం కూడా కాస్త ఎక్కువనట. ఆ కారణంగా చాలా మందిని దూరంగా చేసుకున్నారనే మాట వినిపిస్తుంది.