• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోకేష్ కనగరాజ్.. ఆ...

లోకేష్ కనగరాజ్.. ఆ సీక్వెల్ ఇంకెప్పుడు?

| ఖైదిలో చెప్పకుండా వదిలేసిన స్టొరీ లైన్ ని ఖైది 2లో లోకేష్ కనగరాజ్ చెబుతాడని ఆ మూవీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-23 04:53 GMT

కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైది మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కార్తి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది. తమిళంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి చిత్రంగా ఖైది మూవీ వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. తరువాత మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్నాడు.

వీటిలో విక్రమ్, లియో సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే వచ్చాయి. ఖైది సీక్వెల్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ కూడా చాలా సందర్భాలలో ఈ సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇస్తూ వచ్చాడు. విక్రమ్ మూవీ తర్వాత ఖైది2 స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు.

దళపతి విజయ్ అవకాశం ఇవ్వడంతో లియో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక అయిన ఖైది2 ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమాని లోకేష్ మొదలుపెట్టారు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. కూలీ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతోంది.

దీని తర్వాత అయిన ఖైది 2 చేస్తాడా అనే డౌట్ ఇప్పుడు ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. ఖైదిలో చెప్పకుండా వదిలేసిన స్టొరీ లైన్ ని ఖైది 2లో లోకేష్ కనగరాజ్ చెబుతాడని ఆ మూవీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం వరుసగా స్టార్ట్ హీరోలని లైన్ లో పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

కూలీ తర్వాత లోకేష్ నెక్స్ట్ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో సినిమా చేయనున్నాడు అనే టాక్ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని ప్రచారం నడుస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. ఒక వేళ అమీర్ ఖాన్ తో సినిమాని లోకేష్ కనగరాజ్ స్టార్ట్ చేస్తే మరోసారి ఖైది2 వెనక్కి వెళ్ళడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. లోకేష్ మాత్రం ఈ సీక్వెల్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు.

కాని ఎప్పుడనేది మాత్రం స్పష్టత లేదు. నెక్స్ట్ లోకేష్ ప్రభాస్ తో కూడా ఒక మూవీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన డేట్స్ కోసం కూడా ట్రై చేస్తున్నాడు. లోకేష్ లైన్ అప్ లో ఖైది సీక్వెల్ ఉంది. అలాగే విక్రమ్ మూవీ సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది. లియోకి సీక్వెల్ ప్లాన్ చేసిన విజయ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ వరుస సీక్వెల్స్ ని ఎప్పటికి అతను పూర్తి చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Tags:    
  • Lokeshkangaraju 
  • Khaidi 
  • Karthi 
  • Khaidi2 
  • Leo 
  • Master 
  • Coolie 
  • Vikram 
  • Khaidisequeal 
  • Aamirkhan 

Similar News

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

Copyright @2026

Powered by Blink CMS