టాలీవుడ్ షిఫ్ట్ అవుతున్న లోకేష్..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్నాడా ఏంటి ఇది నిజమేనా అని కాస్త డౌట్ పడొచ్చు.;

Update: 2025-11-28 05:14 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్నాడా ఏంటి ఇది నిజమేనా అని కాస్త డౌట్ పడొచ్చు. ఖైదీ, విక్రం లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన లోకేష్ కనకరాజ్ లియోతో బెటర్ అనిపించినా కూలీతో అంచనాలను అందుకోలేదు. అయినా కూడా కూలీ కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఐతే కోలీవుడ్ కి 1000 కోట్లు సినిమా ఇచ్చే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అనుకున్న ఫ్యాన్స్ ని ఆయన డిజప్పాయింట్ చేశాడు. అందుకే కూలీ తర్వాత ఆయనకు ఛాన్స్ లు ఇవ్వట్లేదట.

అమీర్ ఖాన్ తో చేయాలనుకున్న ప్రాజెక్ట్..

రజనీ, కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన లోకేష్ అది మిస్ అవగా అటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ కాస్త ఆగిపోయింది. ఐతే లేటెస్ట్ గా లోకేష్ కనకరాజ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడన్న న్యూస్ వైరల్ అయ్యింది. గత రెండు రోజులుగా తెలుగు సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుండగా లేటెస్ట్ గా లోకేష్ తెలుగు సినిమా నిజమే కానీ హీరో మాత్రం పవర్ స్టార్ కాదు మరో స్టార్ అంటూ చెబుతున్నారు.

అవును లోకేష్ ఎప్పటి నుంచో తెలుగు స్టార్స్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఐతే అతని లిస్ట్ లో చరణ్, ఎన్ టీ ఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఉన్నారు. పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తో కూడా లోకేష్ సినిమా చేయాలని అనుకున్నాడట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తో స్క్రిప్ట్ చర్చలు కూడా జరిపాడట లోకేష్. ఏదైతే పవన్ కళ్యాణ్ తో లోకేష్ సినిమా నిర్మిస్తుందని వార్తల్లో వచ్చిన కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ అల్లు అర్జున్, లోకేష్ కాంబో సినిమా ప్లాన్ చేస్తుందట.

కూలీ ఎగ్జిక్యూషన్ మిస్ ఫైర్..

ఐతే లోకేష్ తో స్టోరీ డిస్కషన్ లో పాల్గొన్న బన్నీ తన నిర్ణయం చెబుతానని అన్నాడట. ఎందుకంటే కూలీ ముందు వరకు లోకేష్ కథ చెబితే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అయ్యేది కానీ కూలీ ఎగ్జిక్యూషన్ ఎందుకో మిస్ ఫైర్ అయ్యింది. అందుకే లోకేష్ కి ఈ తిప్పలు తప్పట్లేదు. అల్లు అర్జున్ సినిమాతో లోకేష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే కచ్చితంగా నెక్స్ట్ లైన్ లో బిగ్ స్టార్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఐతే ఆ సినిమా పూర్తయ్యే వరకు లోకేష్ సినిమా వర్క్ జరుగుతుందట. సో అట్లీ తర్వాత అల్లు అర్జున్ దాదాపు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లోనే కన్ఫర్మ్ అని అంటున్నారు. మరి ఈ అప్డేట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Tags:    

Similar News