లోకేష్ ని అస్సలు వదలట్లేదుగా..?
లోకేష్ కనకరాజ్ కూలీ ముందు వరకు దాదాపు తమిళ్ ఆడియన్స్ కూడా తమిళ పరిశ్రమకు 1000 కోట్లు తెచ్చే డైరెక్టర్ అతనే అనే రేంజ్ లో చెప్పుకొచ్చారు.;
లోకేష్ కనకరాజ్ కూలీ ముందు వరకు దాదాపు తమిళ్ ఆడియన్స్ కూడా తమిళ పరిశ్రమకు 1000 కోట్లు తెచ్చే డైరెక్టర్ అతనే అనే రేంజ్ లో చెప్పుకొచ్చారు. కానీ కూలీ రిలీజ్ తర్వాత అందరు ఆయన్ను టార్గెట్ చేశారు. రజనీ కూలీ అంచనాలను అందుకోకపోవడంలో ప్రధాన కారణంగా లోకేష్ కనకరాజ్ ఎగ్జిక్యూషనే అంటూ చెబుతున్నారు. ఎందుకంటే కమల్ తో విక్రం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన లోకేష్ రజనీతో కూలీ లాంటి సినిమా తీస్తాడని ఊహించలేదు. సినిమా పై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ వల్ల ఆ సినిమా యావరేజ్ గా ఆడినా ఆడియన్స్ పట్టించుకోలేదు. కూలీ సినిమాపై ఉన్న అంచనాలు ఆ సినిమా భారీగా ఉండటం దానికి తగినట్టుగా సినిమా లేకపోవడం అన్నది కూడా ఈ రిజల్ట్ కి రీజన్ అవ్వొచ్చు.
ఖైదీతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ విక్రం తో డబల్ బ్లాక్ బస్టర్..
సినిమా వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా కూడా సోషల్ మీడియాలో ఇంకా లోకేష్ ని వదలకుండా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఖైదీతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ విక్రం తో డబల్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఐతే ఆ తర్వాత మాస్టర్, లియో సినిమాలు జస్ట్ ఓకే అనిపించాయి. లియో కూడా సోసోగా ఉన్నా లోకేష్ ని పెద్దగా ట్రోల్ చేయలేదు. కానీ కూలీ విషయంలో మాత్రం అతను డైరెక్ట్ టార్గెట్ అయ్యాడు.
ఇప్పుడు డైరెక్టర్ గా కాస్త గ్యాప్ ఇచ్చి యాక్టర్ గా న్యూ టర్న్ తీసుకున్నాడు లోకేష్. అతను చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఐతే డైరెక్టర్ లోకేష్ ఎఫెక్ట్ యాక్టర్ లోకేష్ సినిమాకు ఏదైనా ఎఫెక్ట్ పడేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక డైరెక్టర్ గా లోకేష్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడన్నది కూడా డౌట్ గానే ఉంది. ఎందుకంటే అమీర్ ఖాన్ తో సినిమా అంటూ హడావిడి చేస్తే అది కాస్త మిస్ అయ్యింది. రజనీ, కమల్ కాంబో సినిమా అన్నారు కానీ అది అసలు ఛాన్సే లేదని తేలింది.
లోకేష్ నెక్స్ట్ ఏ హీరోతో..
లోకేష్ నెక్స్ట్ ఏ హీరోతో చేస్తాడన్న డిస్కషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఐతే కూలీ గాయాన్ని మర్చిపోయి లోకేష్ మళ్లీ తన ఖైదీ, విక్రం రోజులను గుర్తు చేసుకుని నెక్స్ట్ అటెంప్ట్ చేయాలని చూస్తున్నారు. మొన్నటిదాకా ఫాం లో ఉన్న లోకేష్ తో తెలుగు హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ కూడా వర్క్ చేయాలని ఫ్యాన్స్ కోరారు. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ తో సినిమా చేయకపోవడం బెటర్ అనేస్తున్నారు.
ఐతే ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలనుకునేలా లోకేష్ నెక్స్ట్ సినిమాతో తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. మరి డైరెక్టర్ లోకేష్ నెక్స్ట్ సినిమాపై చాలా మంది కన్ను ఉంటుంది. అతని ఎలాంటి సినిమాతో వస్తాడన్నది చూడాలి.