బన్నీ, పవన్ కాదట.. లోకేష్ కోసం మైత్రీ 'బిగ్' స్కెచ్.

వాస్తవానికి 'కూలీ' ఫలితం లోకేష్ గ్రాఫ్ ను కొంచెం తగ్గించినా, మైత్రీ మేకర్స్ మాత్రం ఆయన టేకింగ్ మీద నమ్మకంతో ఉన్నారు. లోకేష్ మార్క్ యాక్షన్ కు సరైన స్టార్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవుతుందని వారు భావిస్తున్నారు.;

Update: 2025-11-29 22:30 GMT

'విక్రమ్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, ఇప్పుడు కాస్త గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. రజినీకాంత్ తో చేసిన 'కూలీ' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, లోకేష్ తర్వాతి అడుగు ఎటువైపు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ను లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.

గత కొద్ది రోజులుగా లోకేష్ తర్వాతి సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉంటుందని, కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉంటుందని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ లో బన్నీ కానీ, పవన్ కానీ లేరని స్పష్టమవుతోంది. మైత్రీ సంస్థ లోకేష్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యింది కానీ, హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదట. దీంతో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందా అనే చర్చ మొదలైంది.

వాస్తవానికి 'కూలీ' ఫలితం లోకేష్ గ్రాఫ్ ను కొంచెం తగ్గించినా, మైత్రీ మేకర్స్ మాత్రం ఆయన టేకింగ్ మీద నమ్మకంతో ఉన్నారు. లోకేష్ మార్క్ యాక్షన్ కు సరైన స్టార్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవుతుందని వారు భావిస్తున్నారు. అందుకే హీరో ఎవరనేది పక్కన పెట్టి, ముందు డైరెక్టర్ తో డీల్ క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లోకేష్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇక్కడే మరో ఆసక్తికరమైన కాంబినేషన్ తెరపైకి వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ కు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తో సినిమా చేయాలనే కమిట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. "గుడ్ బ్యాడ్ అగ్లీ" తర్వాత అజిత్ మైత్రీ బ్యానర్ లో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు లోకేష్ డేట్స్, అజిత్ డేట్స్ మైత్రీ చేతిలో ఉన్నాయి కాబట్టి.. ఈ ఇద్దరినీ కలిపి ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

లోకేష్ కనకరాజ్ ఎప్పటి నుంచో అజిత్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్, లోకేష్ డార్క్ యాక్షన్ స్టైల్ కలిస్తే అది పక్కా 'మాస్ జాతర' అవుతుంది. అటు మైత్రీకి కూడా పాన్ ఇండియా రేంజ్ లో వర్కవుట్ అయ్యే కాంబినేషన్ కావాలి. కాబట్టి బన్నీ, పవన్ కానప్పుడు.. అజిత్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మొత్తానికి లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమాపై ఉన్న సస్పెన్స్ ఇంకా వీడలేదు. హీరో ఎవరో తెలియకపోయినా, ప్రాజెక్ట్ మాత్రం కన్ఫర్మ్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ వేస్తున్న ఈ స్కెచ్ లో అజిత్ చిక్కుతాడా? లేక మరో టాలీవుడ్ స్టార్ ఎవరైనా సీన్ లోకి వస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News