• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్‌ హీరోలతో...

స్టార్‌ హీరోలతో మల్టీస్టారర్‌ చాలా ఈజీ.. ఎందుకంటే!

| తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ మారుమ్రోగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-11-06 10:30 GMT

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ మారుమ్రోగుతోంది. ఖైదీ, విక్రమ్‌, లియో ఇలా దేనికి అదే అన్నట్లుగా విభిన్నమైన సూపర్‌ హిట్స్ ను సొంతం చేసుకున్న లోకేష్‌ కనరాజ్ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తో 'కూలీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిలోనూ కూలీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటి వరకు లోకేష్ నుంచి వచ్చిన సినిమాల మాదిరిగానే చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రతో పాటు పలువురు ప్రముఖ స్టార్స్ కనిపించబోతున్నారు.

శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూలీ గురించిన విషయాలను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజా ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నారు. 9 గంటలకు షూటింగ్‌ అంటే రజనీ సర్‌ ఉదయం 7 గంటల వరకు సెట్స్ లో ఉండేవారు. కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు సర్‌ అంటూ తన వల్ల ఏ ఒక్కరు ఇబ్బందికి గురి కాకూడదని అనే వారు. కమల్‌ సర్‌, విజయ్ సర్‌ సైతం టైమ్‌ ను బాగా పాటించే వారు. వారు షూటింగ్‌ కు ఎప్పుడూ లేట్‌గా వచ్చిందే లేదు. ట్రాఫిక్‌ జామ్‌ వల్ల ఆలస్యం అవుతుందేమో అనే ఉద్దేశ్యంతో ముందుగానే స్టార్ట్‌ అయ్యేవారు. అలాంటి గొప్ప వ్యక్తులతో సినిమాలు చేయడం చాలా బాగుంటుంది అన్నాడు.

స్టార్‌ హీరోలు దాదాపు అందరూ చాలా క్రమ శిక్షణతో ఉంటారు, అంతే కాకుండా సినిమా కోసం స్క్రిప్ట్‌ గురించి ఏ సలహా ఇచ్చినా దాన్ని సమర్ధిస్తారు. కనుక స్టార్‌ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలను చేయడం చాలా ఈజీ అని నేను భావిస్తున్నాను. ఒకరిని ఒకరు గౌరవించుకోవడంతో పాటు, ఒకరి నిర్ణయాలను ఒకరు సమర్ధించడం వల్ల స్టార్‌ హీరోలతో చాలా సునాయాసంగా మల్టీస్టారర్‌ లు తీయవచ్చు అన్నాడు. సాధారణంగా స్టార్‌ హీరోలతో మల్టీస్టారర్‌ సినిమాలు కష్టం అని దర్శకులు భావిస్తూ ఉంటారు. కానీ లోకేష్ కనగరాజ్‌ మాత్రం యంగ్‌ హీరోలతో పోల్చితే స్టార్‌ హీరోలతో మల్టీస్టారర్‌ సినిమాలు చేయడం ఈజీ అంటూ వింత లాజిక్ చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.

రజనీకాంత్‌, శృతి హాసన్‌, నాగార్జున, ఉపేంద్రతో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఆమీర్‌ ఖాన్‌ గెస్ట్‌ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయమై ఇంటర్వ్యూలో ప్రశ్నించిన సందర్భంగా లోకేష్ స్పందిస్తూ... తనకు ఆమీర్ ఖాన్‌ అంటూ చాలా ఇష్టం. కచ్చితంగా ఆయనతో భవిష్యత్తులో వర్క్ చేస్తానంటూ ప్రకటించాడు. దాంతో సినిమాలో ఆమీర్‌ ఖాన్‌ ఉన్నట్లే అనే చర్చ మరింతగా జరుగుతోంది. కూలీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్‌ ఖైదీ 2 సినిమాను చేయబోతున్నాడు. ఇటీవల ప్రభాస్ తో ఒక సినిమా విషయమై చర్చలు జరిపాడని తెలుస్తోంది. లోకేష్ చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తాడు. ఏడాదికి రెండు సినిమాలు వచ్చే విధంగా ఆయన ప్లాన్‌ చేస్తున్నాడు.

Tags:    
  • Lokeshkanagaraj 
  • Cooliemovie 
  • Rajinikanth 
  • Nagarjuna 
  • Upendra 
  • Filmindustry 
  • Lokeshcinematicuniverse 
  • Kamalhaasan 
  • Vijaythalapathy 

Similar News

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS