లోక పార్ట్ 2, 3 అదిరిపోయే ప్లానింగ్..?

కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో డామెరిక్ అరుణ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా లోక పార్ట్ 1 చంద్ర. మలయాళం నుంచి ఇలాంటి ఒక ఉమెన్ సూపర్ హీరో మూవీ వస్తుందని ఊహించలేదు.;

Update: 2025-09-18 05:55 GMT

కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో డామెరిక్ అరుణ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా లోక పార్ట్ 1 చంద్ర. మలయాళం నుంచి ఇలాంటి ఒక ఉమెన్ సూపర్ హీరో మూవీ వస్తుందని ఊహించలేదు. అది కూడా తక్కువ బడ్జెట్ లోనే అదిరిపోయే అవుట్ పుట్ ఇచ్చారు. లోక పార్ట్ 1 చంద్ర సినిమా చూసిన ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. అందుకే ఈ సినిమా 200 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఐతే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ కూడా క్యామియో రోల్స్ ఇచ్చారు.

లోక పార్ట్ 2 లో టోవినో థామస్..

లోక పార్ట్ 1 చంద్ర కాగా సినిమా పార్ట్ 2, 3 కూడా ఉంటుందని తెలుస్తుంది. లోక పార్ట్ 2 లో టోవినో థామస్ హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ టోవినో థామస్ కి ఇలాంటి సినిమాలు చేయడం అలవాటే. అంతేకాదు లోకలో అతని క్యామియో రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా లోక పార్ట్ 2 టోవినో థామస్ పెద్ద అసెట్ అవుతాడని చెప్పొచ్చు.

మలయాళంలో తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్న టోవినో థామస్ లోక సీరీస్ లో భాగం అవ్వడం అతని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. అంతేకాదు సౌత్ మొత్తం లోక చూసి సూపర్ సినిమా అనేస్తున్నారు. ఇక అందులో టోవినో థమాస్ చేస్తే మరింత స్పెషల్ అవుతుంది. ఇక నెక్స్ట్ లోక పార్ట్ 3లో దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్ గా చేస్తాడని తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్..

లోక సినిమాను దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ బ్యానర్ మీదే నిర్మించాడు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాడు దుల్కర్. ఫిమేల్ సెంట్రిక్ మూవీ రిస్క్ ఎందుకని అనుకోకుండా కొత్త అటెంప్ట్ చేయాలని ట్రై చేశాడు. ఆ సినిమా ఊహించిన దాని కన్నా పెద్ద విజయం అందుకుంది. తప్పకుండా లోక సీరీస్ లకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.

లోక సినిమా మలయాళ పరిశ్రమలోనే క్రేజీ అటెంప్ట్.. ఐతే ఈ సినిమా సక్సెస్ తో నెక్స్ట్ చేయబోయే సీరీస్ ల బడ్జెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. లోక తరహా సినిమాలు మలయాళం నుంచి వస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో వాళ్లు సృజనాత్మక సినిమాలే కాదు కమర్షియల్, విజువల్ ట్రీట్ ఇచ్చే సినిమాలు కూడా చేస్తారని ప్రూవ్ అవుతుంది. దుల్కర్ సల్మాన్ మొదలు పెట్టిన ఈ సూపర్ హీరో మూవీస్ ట్రెండ్ అక్కడ కొనసాగేలా ఉంది. అంతేకాదు కళ్యాణి ప్రియదర్శన్ కి కూడా ఇలాంటి క్రేజీ రోల్స్ ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు.

Tags:    

Similar News