ఓటీటీలోకి లిటిల్ హార్ట్స్.. మరో సర్ప్రైజ్ ఏంటంటే?

అనుష్క ఘాటీ, శివ కార్తికేయన్ మదరాసి సినిమాలకు పోటీగా విడుదలైన ఈ చిన్న సినిమా ఈ రెండు సినిమాలను పక్కకు నెట్టేసి అతిపెద్ద విజయం అందుకుంది. అయితే అలాంటి లిటిల్ హార్ట్స్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..;

Update: 2025-09-29 11:51 GMT

భారీ తారాగణం లేదు.. చెప్పుకోదగ్గ బడ్జెట్ లేదు.. ఒక చిన్న సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది.. #90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయిన మౌళి తనూజ్.. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో పాపులర్ అయినటువంటి హీరోయిన్ శివాని నాగారం ఇద్దరి కాంబోలో వచ్చిన 'లిటిల్ హార్ట్స్' మూవీ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అనుష్క ఘాటీ, శివ కార్తికేయన్ మదరాసి సినిమాలకు పోటీగా విడుదలైన ఈ చిన్న సినిమా ఈ రెండు సినిమాలను పక్కకు నెట్టేసి అతిపెద్ద విజయం అందుకుంది. అయితే అలాంటి లిటిల్ హార్ట్స్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..

అదేంటంటే.. ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందట..

వింటుంటేనే లిటిల్ హార్ట్స్ మూవీ లవర్స్ అందరికీ ఒక రకమైన హ్యాపీనెస్ కలుగుతుంది. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ మూవీచూసి ఎంతో ఎంజాయ్ చేశారు. అలాంటిది లిటిల్ హార్ట్స్ 2 మూవీ లో మరెంత ఫన్ ని జోడిస్తారో డైరెక్టర్ అని తెగ ఎక్సైట్ అవుతున్నారు.. ఇక లిటిల్ హార్ట్స్ విషయానికి వస్తే.. సాయి మార్తాండ డైరెక్షన్లో మౌళి తనూజ్.. శివాని నాగారం హీరో హీరోయిన్లుగా.. తెరకెక్కిన ఈ సినిమా రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 33 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు ఈ సినిమాకి మహేష్ బాబు,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇంప్రెస్ అయ్యి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.

అయితే తాజాగా ఈ మూవీ విడుదలై నెల రోజులకి దగ్గర పడుతుండడంతో ఈటీవీ విన్ ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. అంతేకాదు మరో ఆసక్తికర న్యూస్ కూడా పంచుకున్నారు. అదేంటంటే..ఈటీవీ విన్ ఓటీటీ లో అక్టోబర్ 1 నుండి లిటిల్ హార్ట్స్ మూవీ స్ట్రీమింగ్ అవ్వడమే కాకుండా ఇక్కడ మరో సర్ప్రైజ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేంటంటే ఓటీటీ వెర్షన్ లో లిటిల్ హార్ట్స్ సీక్వెల్ కి లీడ్ ఇస్తూ.. ఎక్స్టెన్షన్ చేయబోతున్నారంట. ఈ విషయం తెలిసే ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈటీవీ విన్ యాప్ నుండి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది.

ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన లిటిల్ హార్ట్స్ మూవీ కి సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఆ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని అలాగే సీక్వెల్ కూడా చాలా తొందరగా రావాలి అని ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి లిటిల్ హార్ట్స్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News