దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్ వైరల్!
దొంగ మొగుడు అంటూ ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి పెట్టిన పోస్ట్ సంచలనమవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఎందుకు లిఖిత రెడ్డి ఆ పోస్ట్ పెట్టింది అని ఆలోచనలో పడ్డారు..;
దర్శకుడు ప్రశాంత్ నీల్.. కేజిఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈయన కేజీఎఫ్ 2, సలార్ మూవీలతో మరొక్కసారి దర్శకుడుగా తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.. అయితే అలాంటి డైరెక్టర్ గురించి తాజాగా తన భార్య పెట్టిన ఒక పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.దొంగ మొగుడు అంటూ ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి పెట్టిన పోస్ట్ సంచలనమవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఎందుకు లిఖిత రెడ్డి ఆ పోస్ట్ పెట్టింది అని ఆలోచనలో పడ్డారు..
అయితే లిఖిత రెడ్డి ఈ పోస్ట్ పెట్టడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే ప్రశాంత్ నీల్ ఎక్కువగా బ్లాక్ కలర్ నే ఇష్టపడతారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించే సినిమాలు కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు ఆయన కలర్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న విషయం ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పుకొచ్చారు. అందుకే కే జి ఎఫ్-1, కేజీఎఫ్-2,సలార్ ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ కలర్ లోనే వచ్చాయి.
ఆయన సినిమాలో వేరే కలర్స్ ఎక్కువగా కనిపించవు. ఎక్కువగా బ్లాక్ నే చూజ్ చేసుకుంటారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ కి బ్లాక్ బ్లైండ్ నెస్ ఉంది కాబట్టి.. ఆయన ఎక్కువగా నలుపు రంగానే చూజ్ చేసుకుంటారు.. ఇక ఆయన తీసే సినిమాలు నలుపు రంగులో ఉండడంతో చాలామంది ఫ్యాన్స్ కూడా ప్రశాంత్ నీల్ కి బ్లాక్ కలర్ సిగ్నేచర్ కలర్ కావచ్చు అని ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఆ కామెంట్స్ కి తగ్గట్టు హీరోల సూట్ ల నుండి మొదలు సినిమాలో ప్రతి ఒక్క దగ్గర నలుపు రంగు మాత్రమే కనిపించేది. అంతేకాదు ఈయన డ్రెస్ లు కూడా బ్లాక్ కలర్, యాష్ కలర్ లోనే ఉండేవి.అయితే అలాంటి ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లోకి మారిపోయారు.ఆ ఫోటో చూడడానికి రెండు కళ్ళు చాలవు. తాజాగా ప్రశాంత్ నీల్ తన భార్యతో కలిసి ఏదో ఫంక్షన్ కి వెళ్ళినట్టు కనిపిస్తోంది.
ఆ ఫంక్షన్ కి వెళ్ళిన ఫోటోని ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.అయితే ఆ ఫోటో చూసిన అందరూ షాక్ అయిపోతున్నారు. మరి ఇంతకీ ఆ ఫోటో చూసి షాక్ అవ్వాల్సిన మ్యాటర్ ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు. అయితే ఆ ఫోటోలో ఎప్పుడూ లేనిది ప్రశాంత్ నీల్ వైట్ అండ్ వైట్ కాంబోలో కనిపించారు. ఎప్పుడు నలుపు రంగులో ఉండే డ్రెస్సులు వేసుకునే ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా వైట్ కలర్ షర్టు, వైట్ కలర్ పంచెతో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైట్ కలర్ ట్రెడిషనల్ వేర్ లో ప్రశాంత్ నీల్ కనిపించేసరికి చాలామంది ఆయన్ని గుర్తుపట్టలేకపోతున్నారు.
ఎందుకంటే ఎప్పుడు ఆయన బ్లాక్ లోనే కనిపిస్తారు. అయితే తన భర్తతో కలిసి ఉన్న ఫోటోని లిఖిత రెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడమే కాకుండా దొంగ మొగుడు ఫైనల్లి వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు అని అర్థం వచ్చేలా.. "విత్ మై దొంగ మొగుడు ఇన్ వైట్ ఫైనల్లీ" అంటూ వైట్ కలర్ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ ఇచ్చింది. అలా ఫైనల్గా తన భర్త వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాడని తన పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.అయితే ఇది చూసేవారికి చిన్న విషయమే కానీ ప్రశాంత్ నీల్ ని ఇష్టపడే వారికి మాత్రం పెద్ద విషయం అనుకోవచ్చు.
ఎందుకంటే ఇన్ని రోజులు సినిమా బాక్గ్రౌండ్ నుండి మొదలు ఆయన వేసుకునే డ్రెస్ ల వరకు నలుపు రంగులో ఉండేలా చూసుకునే ఈయన సడన్గా వైట్ కలర్ లోకి మారిపోవడం నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఈ వైట్ అండ్ డ్రెస్ ఫోటోపై చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఫైనల్ గా మా అభిమాన డైరెక్టర్ ని వైట్ కలర్ డ్రెస్ లో చూసాం ఇక చాలు అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెడితే.. మరో నెటిజన్ ఎప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉండే ప్రశాంత్ నీల్ ని ఇలా వైట్ కలర్ డ్రెస్ లో చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ కామెంట్ పెట్టాడు. ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ నీల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.