• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇది పర్ఫెక్ట్ రీ రిలీజ్...

ఇది పర్ఫెక్ట్ రీ రిలీజ్ అంటే..

| ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సినిమాలు మాత్రమే కాదు, సినిమాలో స్టోరీ బాగుండి , హిట్ కాని సినిమాలను సైతం రీ రిలీజ్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-14 07:42 GMT

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సినిమాలు మాత్రమే కాదు, సినిమాలో స్టోరీ బాగుండి , హిట్ కాని సినిమాలను సైతం రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదొక ట్రెండ్ గా మారింది. ఇప్పటి వరకు చాలా మంది హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఈ సీక్వెన్స్ లోకి హీరో రానా కూడా వచ్చేస్తున్నారు.

రానా తన కెరీర్ లో చాలా రకాల సినిమాలు తీశారు. వాటన్నింటిలో లీడర్ సినిమా మాత్రం స్పెషల్ అని చెప్పాలి. రానా కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా దీనిని చెప్పొచ్చు. రాజకీయ కోణంలో సాగే సినిమా ఇది. ఇలా కూడా సినిమా తీయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఈ సినిమా తీశారు. అది కూడా ఎప్పుడూ లవ్ స్టోరీస్ లాంటి ఫీల్ గుడ్ మూవీలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించారు.

సీఎం స్థానంలో ఉన్న తండ్రి సడెన్ గా చనిపోవడంతో, ఆ ముఖ్యమంత్రి పదవిని ఆయన కొడుకు తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఈ మూవీలో చూపించారు. ఈ పాత్రలో రానా ఒదిగిపోయాడు. చాలా చక్కగా సెటిల్డ్ గా నటించాడు. ఆ సమయంలో రిలీజ్ చేసినప్పుడు, థియేటర్ లలో పెద్దగా ఈ మూవీ రీచ్ అవ్వలేకపోయింది.

కానీ, ఈ మూవీ టీవీల్లో విడుదలైనప్పుడు మాత్రం విపరీతంగా చూశారు. టీఆర్పీ రేటింగ్ లు పగిలిపోయాయి. అయితే, ఇప్పుడు ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్లాన్ చేయడం విశేషం. వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నా, ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ మొదలైంది.

కాగా, అలాంటిది ఈ పాలిటిక్స్ తో సంబంధం ఉన్న ఈ సినిమాని ఎన్నికల సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. మరి, ఈ సినిమా రీ రిలీజ్ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా..? ఈ సారి ఎంత కలెక్షన్ రాబడుతుందో చూడాలి.

Tags:    
  • Ranadaggubati 
  • Leadermovie 
  • Tollywood 
  • Movienews 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS