• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  14 ఏళ్ల తర్వాత......

14 ఏళ్ల తర్వాత... అదిరిందయ్యా చంద్రం

| ఈటీవీ విన్ తో మరో ప్రాజెక్ట్‌ కి శివాజీ సైన్ చేశాడని సమాచారం అందుతోంది. సుధీర్ శ్రీరామ్‌ దర్శకత్వంలో శివాజీ ముఖ్య పాత్రలో ఒక వెబ్‌ మూవీ రూపొందుతోంది. ఆ మూవీలో లయ ను హీరోయిన్ గా నటింపజేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-18 04:26 GMT

ఓ కమర్షియల్‌ యాడ్‌ లో బాగా పాపులర్ అయిన అదిరిందయ్యా చంద్రం డైలాగ్‌ మూవీ టైటిల్‌ గా రూపొందిన చిత్రం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోగా శివాజీ నటించగా హీరోయిన్ గా లయ నటించింది. వీరిద్దరు మొదట 'మిస్సమ్మ' సినిమాలో నటించారు. ఆ తర్వాత శివాజీ మరియు లయ పలు సినిమాల్లో నటించారు. వీరు నటించిన టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం సినిమాలు కమర్షియల్‌ గా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో శివాజీ మరియు లయ జోడికి హిట్‌ పెయిర్ గా గుర్తింపు లభించింది. అప్పట్లో వీరిద్దరూ మరిన్ని సినిమాల్లో నటించాలని ప్రేక్షకులు కోరుకున్నారు.

లయ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి పోవడంతో ఆమె సినిమాల్లో నటించలేదు. చాలా సంవత్సరాల తర్వాత లయ మళ్లీ టాలీవుడ్‌ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే లయ ఒకటి రెండు సినిమాలకు సైన్‌ చేయడంతో పాటు, షూటింగ్‌ లో కూడా పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక శివాజీ ఆ మధ్య రాజకీయాలు, ఉద్యమాలు అంటూ సినిమాలకు దూరంగా ఉన్నాడు. బిగ్‌ బాస్ తో తిరిగి కొత్త కెరీర్‌ ను ప్రారంభించి #90's తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివాజీ ప్రస్తుతం అదే ప్రాజెక్ట్‌ సీక్వెల్‌ లో నటిస్తున్నాడు.

ఈటీవీ విన్ తో మరో ప్రాజెక్ట్‌ కి శివాజీ సైన్ చేశాడని సమాచారం అందుతోంది. సుధీర్ శ్రీరామ్‌ దర్శకత్వంలో శివాజీ ముఖ్య పాత్రలో ఒక వెబ్‌ మూవీ రూపొందుతోంది. ఆ మూవీలో లయ ను హీరోయిన్ గా నటింపజేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమె సైన్ చేసిందని, త్వరలోనే షూటింగ్ కి జాయిన్ అవ్వబోతుందని సమాచారం అందుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో శివాజీ మరియు లయ వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తూ ఈ సినిమాలో నటించబోతున్నారని సమాచారం అందుతోంది.

ఈటీవీ విన్‌ లో స్ట్రీమింగ్‌ అయిన #90's బయోపిక్ కి మంచి రెస్పాన్స్‌ దక్కిన నేపథ్యంలో ఈ సినిమాకు కూడా ముందస్తు బజ్ క్రియేట్‌ అయ్యయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శివాజీ తో లయ నటించడం వల్ల సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. వీరి కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు సూపర్‌ హిట్‌ అవ్వడం ఒక సెంటిమెంట్‌ గా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ ను స్పీడ్ గా పూర్తి చేసి త్వరలోనే సినిమాను ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్‌ స్క్రీనింగ్ అయితే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • Adrinidhiayachandram 
  • Laya 
  • Shivaji 
  • Sudheersriram 
  • Webseries 
  • Etvwin 
  • 90sBiopic 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS