పౌడర్ కారణంగా చీవాట్లు తిన్న హీరోయిన్!
'అందాల రాక్షసి' చిత్రంతో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమా తోనే నేచురల్ బ్యూటీగా ఫేమస్ అయింది.;
'అందాల రాక్షసి' చిత్రంతో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమా తోనే నేచురల్ బ్యూటీగా ఫేమస్ అయింది. ఆ సినిమా కోసం లావణ్య ఎలాంటి మ్యాకప్ లేకుండా నటిం చింది. హను రాఘవపూడి ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా ఆ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందు కున్నాడు. ఆ సినిమాతోనే నవీన్ చంద్ర కూడా హీరోగా పరిచమయ్యాడు. అతడి పాత్రకు మంచి పేరొచ్చింది.
రాహుల్ రవీంద్రన్ కు కూడా అదే తొలి తెలుగు సినిమా. ఇలా ఒక్క సినిమాతో ముగ్గురు ఫేమస్ అయ్యారు. కమర్శియల్ గా ఆ సినిమా సక్సెస్ కానప్పటికీ అందరికీ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా లావణ్య నేచురల్ బ్యూటీగా బాగా ఫేమస్ అయింది అప్పట్లో. ఆ తర్వాత లావణ్య కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా సాగి పోయింది. వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో బిజీ నటిగా మారింది. వరుణ్ తేజ్ ని పెళ్లాడి మెగా ఇంట కోడలిగానూ మారిపోయింది.
అయితే ఈసినిమా షూటింగ్ సమయంలో లావణ్య ను దర్శకుడు హనురాఘవపూడి ఓ సందర్భంలో తిట్టాడుట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. లావణ్య స్కిన్ టోన్ కి ఎలాంటి మ్యాకప్ అవసరం లేదని భావించిన రాహుల్ నేచురల్ గానే షూట్ చేసాడు. అయితే రెండవ షెడ్యూల్ చిత్రీకరణ సమ యంలో షూటింగ్ కి వచ్చే ముందు ఇంటి నుంచి ముఖానికి పౌడర్ రాసుకుని వచ్చిందిట.
దీంతో హను ఫోటో తీసి పౌడర్ వేసుకున్నట్లు గమనించి ఫోటోలో పౌడర్ పటికలు ఎలా కనిపిస్తున్నాయో చూడు అంటూ సీరియస్ అయ్యాడుట. అప్పటి నుంచి ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకూ పౌడర్ రాసు కోవడం మానేసినట్లు తెలిపింది. అలాగే ఒరిజినల్ హెయిర్ తోనే ఆ సినిమా షూట్ లో పాల్గొన్నట్లు తెలిసింది. సెట్ లో సన్ స్క్రీన్స్ కూడా వాడలేదంది.