లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. అందరికీ కనెక్ట్ కావడం లేదెందుకో?
ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపించేది. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఆ చిత్రాలు చర్చనీయాంశంగా మారేవి.
ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపించేది. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఆ చిత్రాలు చర్చనీయాంశంగా మారేవి. స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్స్, లేడీ ఓరియెంటెడ్ రోల్స్ తో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి. అయితే ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల విషయంలో పరిస్థితి కొంత మారుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సినిమా హిట్ కావాలంటే కేవలం ఉమెన్ ఓరియెంటెడ్ స్టోరీ ఉండటం మాత్రమే సరిపోదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆడియన్స్ టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతున్న సమయంలో కథలో ఫ్రెష్ నెస్, ఇంట్రెస్టింగ్ స్టోరీ, స్ట్రాంగ్ ఎమోషన్స్ కచ్చితంగా ఉండాలని వారు భావిస్తున్నారు. ఆ అంశాలు లేకపోతే ప్రేక్షకులు సినిమాను ఈజీగా రిజెక్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చూస్తున్నారు. ఓటీటీలు, సోషల్ మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అందుబాటులో ఉండటంతో వారి అంచనాలు కూడా పెరిగిపోయాయి. అందుకే ఏ సినిమా అయినా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా, కమర్షియల్ సినిమా అయినా ప్రేక్షకుల దృష్టిలో కథే ప్రధానమవుతోంది.
కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మంచి మెసేజ్ లేదా స్ట్రాంగ్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ, కథనంలో ఆకట్టుకునే అంశాలు లేకపోతే ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోతున్నాయని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కేవలం ఉమెన్ టోల్ చుట్టూ కథ తిరగడం వల్ల మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని చెబుతున్నారు. ఇంకా మరోవైపు ఆడియన్స్ కూడా ఇప్పుడు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు.
కుటుంబ ప్రేక్షకులు, యూత్, మాస్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో ఉంటేనే మంచి రిజల్ట్ వస్తున్నాయి. ఆ విషయంలో కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కొన్ని వర్గాలకే నచ్చేలా ఉండటంతో ఓ రేంజ్ లో థియేటర్స్ లో రెస్పాన్స్ దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనర్థం ప్రేక్షకులు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రిజెక్ట్ చేస్తున్నారని కాదు.
కొత్తదనం, స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్స్ యూ వచ్చిన సినిమాలకు ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో ఎన్నో ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించిన విషయం తెలిసిందే. కాబట్టి ప్రేక్షకులు కోరుకునేది మంచి కథ మాత్రమే. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పోటీ కూడా భారీగా పెరిగింది. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం అంత ఈజీ కాదు. అందుకే కథ ఎంపిక నుంచి తెరకెక్కించే వరకు ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
ఏదేమైనా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గలేదని, కానీ వారి అంచనాలు మాత్రం పెరిగాయని చెప్పవచ్చు. ప్రేక్షకులు అనుకున్న రేంజ్ లో వినూత్న, ఆసక్తికరమైన కథనం అందితే ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు భారీ విజయాలు సాధించే అవకాశం ఉందని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, కథలో స్పెషాలిటీనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల విజయానికి కీలకంగా మారిందని చెప్పొచ్చు.