టాప్ డైరెక్టర్స్ దగ్గర KVN అడ్వాన్సులు?
ఐదేళ్ల క్రితం వెంకట్ కె.నారాయణ, నిషా వెంకట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ ను స్టార్ట్ చేయగా.. బ్యానర్ నుంచి తొలి సినిమా సకత్ 2021లో రిలీజ్ అయింది.;
నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. శాండల్ వుడ్ కు చెందిన ఆ బ్యానర్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేస్తోంది. కన్నడ సినిమాలతో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్.. ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ సినిమాలను నిర్మిస్తోంది.. నిర్మించనుంది కూడా..
ఐదేళ్ల క్రితం వెంకట్ కె.నారాయణ, నిషా వెంకట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ ను స్టార్ట్ చేయగా.. బ్యానర్ నుంచి తొలి సినిమా సకత్ 2021లో రిలీజ్ అయింది. సింపుల్ సుని ఆ మూవీకి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఏడాది బై టూ లవ్ పేరుతో మరో సినిమాను తీసుకొచ్చింది. హరి సంతోష్ దర్శకత్వంలో ఆ మూవీ రూపొంది థియేటర్స్ లో సందడి చేసింది.
ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన బ్యానర్.. తమ దృష్టిని ప్రాంతీయ సినిమాల నుంచి పాన్ ఇండియా చిత్రాల వైపు మళ్లించింది. ఇప్పుడు వివిధ సినిమాలు నిర్మిస్తోంది. కన్నడలో KD - ది డెవిల్ పేరుతో రూపొందిస్తున్న మూవీ.. మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
అదే సమయంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్ నూ కేవీఎన్ సంస్థ నిర్మిస్తోంది. యష్ కూడా అందులో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చిలో కన్నడతోపాటు ఇంగ్లీష్ లో కూడా టాక్సిక్ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ ను విడుదల చేయనున్నారు ఆ మూవీ మేకర్స్.
ఇప్పుడు కోలీవుడ్ లోకి విజయ్ దళపతి జన నాయగన్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కేవీఎన్.. మాలీవుడ్ లో మరో సినిమా నిర్మిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పుడు బాబీ కొల్లితో వర్క్ చేయనుంది. ఆయన బర్త్ డే సందర్భంగా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలో హీరోగా నటించనున్నారట.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కేవీఎన్ ప్రొడక్షన్ దూకుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకేసారి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాణ రంగంలో ఏలేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు మరో విషయం కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
తెలుగులో బాబీ కొల్లి మాత్రమే కాకుండా.. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి సహా పలువురు దర్శకులు ఇప్పటికే కేవీఎన్ కాంపౌండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ డైరెక్టర్ కు అయినా హిట్ పడటమే లేట్.. కేవీఎన్ బ్యానర్ నుంచి అడ్వాన్స్ వచ్చేస్తుందని ప్రచారం జరుగుతోంది. తమ సంస్థపై సినిమా తీయాలని రిజర్వ్ చేసుకుంటున్నారని సమాచారం.
ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకప్పుడు అదే పని చేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ కు హిట్ పడితే చాలు.. అడ్వాన్స్ చెల్లించేవారు. అలా సూపర్ హిట్లు, భారీ సినిమాలతో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు సంపాదించుకుంది మైత్రీ. ఇప్పుడు కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా అదే చేస్తుంది. బడా ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగి సత్తా చాటాలని చూస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.