అప్పుడు సార్.. ఇప్పుడు కుబేర
అందులో మొదటిది తెలుగు ఆడియన్స్ ఏ హీరో సినిమానైనా ఎంకరేజ్ చేయడంతో పాటూ, క్యాస్టింగ్ కూడా ఓ కారణం.;
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలయికలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కుబేర. జూన్ 20న కుబేర రిలీజ్ కానుంది. అంటే మరో రెండ్రోజుల్లో కుబేర థియేటర్లలోకి వచ్చేస్తుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ కుబేరపై క్రమేపీ అంచనాలు పెరుగుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కుబేరపై అంచనాలను ఇంకాస్త పెంచింది.
శేఖర్ కమ్ముల తన రూట్ ను మార్చి సీరియస్ జానర్ లో కుబేరను తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. బుకింగ్స్ ఆల్రెడీ మొదలవగా, కుబేర సినిమా తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బుకింగ్సే ఎక్కువగా ఉండటం విశేషం. హైదరాబాద్ లోని కొన్ని మల్టీప్లెక్సుల్లోని షోలు ఆల్మోస్ట్ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. అయితే కుబేర తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ బుకింగ్స్ అవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
అందులో మొదటిది తెలుగు ఆడియన్స్ ఏ హీరో సినిమానైనా ఎంకరేజ్ చేయడంతో పాటూ, క్యాస్టింగ్ కూడా ఓ కారణం. అయితే తమిళులు మాత్రం కుబేర ను తెలుగు మూవీ అనే అనుకుంటున్నారు. కుబేర సినిమాను బై లింగువల్ గా తెరకెక్కించినప్పటికీ ధనుష్ మినహా క్యాస్టింగ్, టెక్నీషియన్లు అంతా టాలీవుడ్ కు చెందిన వారే కావడం మరియు ట్రైలర్ కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టే ఉందని తమిళ ఆడియన్స్ ఫీలవుతున్నారు.
అందుకే కుబేర తెలుగు బుకింగ్స్ కంటే తమిళ బుకింగ్స్ స్లో గా ఉన్నాయి. గతంలో వెంకీ అట్లూరి- ధనుష్ కలయికలో వచ్చిన సార్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సార్ టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలవగా అక్కడ మాత్రం హిట్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు కుబేరకు కూడా అదే పరిస్థితి ఎదురవొచ్చంటున్నారు. మరి రిలీజయ్యాక పరిస్థితులేమైనా మారతాయేమో చూడాలి.