• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్యపై సీనియర్...

బాలయ్యపై సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

| కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే

By - Tupaki Desk
Update: 2024-03-06 08:20 GMT

కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. తెలుగులో టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ తో 'జై సింహా', 'రూలర్' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత మరో చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యని రవికుమార్.. తాజాగా బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. సెట్ లో ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడని, వెంటనే కోపగించుకుంటాడని.. నవ్విన వ్యక్తిని పిలిచి చెయ్యి చేసుకుంటారని అన్నారు.

'గార్డియన్' అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు హాజరైన కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. బాలకృష్ణతో సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్‌లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే తట్టుకోలేడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకొని 'ఆయన ఎందుకు నవ్వుతున్నాడు?' అంటూ కోపం తెచ్చుకుంటాడని చెప్పారు. వెంటనే అతన్ని పిలిచి కొట్టడానికి సిద్ధపడతారని తెలిపారు. ఓ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్ ఇటు తిప్పమని నా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్‌ కి చెప్పాను. అతడు అనుకోకుండా బాలయ్య వైపు ఫ్యాన్స్ తిప్పడంతో, ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. దాంతో శవరణన్ నవ్వాడు. అది చూసి బాలకృష్ణ వెంటనే కోపం తెచ్చుకున్నారు అని దర్శకుడు చెప్పారు.

'హే.. ఎందుకు నవ్వుతున్నావ్' అని బాలయ్య గట్టిగా అరిచాడు. ఆయన మళ్ళీ వీడిని ఎక్కడ కొడతాడో అని నేనే వెళ్లి.. అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాను. దానికి ఆయన 'లేదు లేదు.. వీడు ఆపోజిట్ గ్యాంగ్. చూడు చూడు, ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు' అని అన్నాడు. దీంతో నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోరా అని శరవణన్‌ పై నేను అరిచాను. ఛీ పో అంటూ అప్పుడు కానీ బాలకృష్ణ స్థిమిత పడలేదు అని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు నవ్వుతూ చెప్పగా.. ఆ సమయంలో వేదిక మీదున్న హీరోయిన్ హన్సిక మోత్వానీతో పాటు మిగతా టీమ్ అంతా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

నిజానికి బాలయ్యకి కోపం వస్తే ముందు వెనక ఆలోచించకుండా ఎవరినైనా సరే కొట్టేస్తాడనే వాదన ఉంది. గతంలో ఆయన ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదం అయ్యింది కూడా. పబ్లిక్ లో అభిమానులను కొట్టడం, ఫోటో కోసం వస్తే పక్కకు నెట్టేయడం, సెట్స్ లో తన అసిస్టెంట్స్ పై చేయి చేసుకోవడం వంటి వీడియోలు చాలానే ఉన్నాయి. 'జై సింహా' షూటింగ్ టైంలో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఎదురుగానే, షూ సరిగా కట్టలేదని అసిస్టెంట్ ను బాలకృష్ణ కొట్టిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని.. దగ్గర నుంచి చూసిన ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుందని సన్నిహితులు అంటుంటారు. బాలకృష్ణ వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవరూ ఇలా మాట్లాడరని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఆఫర్స్ లేని టైములో పిలిచి మరీ వరుసగా రెండు సినిమాలకు పనిచేసే అవకాశం ఇస్తే.. కేఎస్ రవికుమార్ ఇప్పుడిలా హీరో మీదనే అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం సరికాదని మండిపడుతున్నారు.

రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి తమిళ అగ్ర హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టిన కేఎస్ రవికుమార్.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో 'స్నేహం కోసం', కింగ్ అక్కినేని నాగార్జునతో 'బావ నచ్చాడు' వంటి చిత్రాలను రూపొందించారు. 2016లో 'కోటిగొబ్బ 2' తర్వాత దర్శకుడికి రెండేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే 2018లో 'జై సింహా' సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు బాలయ్య. వెంటనే వీరి కాంబోలో 'రూలర్' అనే మూవీ కూడా వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా నటన మీద ఫోకస్ పెట్టిన రవికుమార్.. తమిళ్ లో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బాలకృష్ణపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

#Balakrishna-வை பங்கமாய் கலாய்த்த #KSRavikumar🤣 | #shorts #GuardianPressMeet #NBK pic.twitter.com/jHo9lCAzji

— Kalakkal Cinema (@kalakkalcinema) March 6, 2024
Tags:    
  • Ksravikumar 
  • Balakrishna 
  • Filmindustry 
  • Gardiyanmovie 
  • Nandamuribalakrishna 
  • Ravikumar 
  • Kollywooddirector 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS