సిగరెట్ వెలిగించిన కృతి సనోన్.. ఇదీ అసలు నిజం!
మహేష్ 1-నేనొక్కడినే చిత్రంతో కథానాయికగా పరిచయమైంది కృతి సనోన్. ఆరంగేట్రమే డ్యాషింగ్ పెర్ఫామర్ గా పేరు తెచ్చుకుంది.;
మహేష్ 1-నేనొక్కడినే చిత్రంతో కథానాయికగా పరిచయమైంది కృతి సనోన్. ఆరంగేట్రమే డ్యాషింగ్ పెర్ఫామర్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా చూశాక, దర్శకుడు సుకుమార్ ఎంపిక తప్పు కాదని క్రిటిక్స్ అంగీకరించారు. ఆ తర్వాత నాగచైతన్య సరసన `దోచేయ్ `చిత్రంలో నటించింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ లో సీత పాత్రలోను నటించింది. అయితే దురదృష్టవశాత్తూ టాలీవుడ్ లో ఈ భామకు అన్నీ పరాజయాలే ఎదురయ్యాయి.
ఓవైపు హిందీ చిత్రసీమలో నటిస్తూనే, ఇతర భాషలలో తన ప్రయత్నాలను ఆపడం లేదు కృతి. తాజాగా ఈ బ్యూటీ సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఆదిపురుష్ భామ ఇంత స్వేచ్ఛగా సిగరెట్ తాగుతోందేమిటి! అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం సినిమా కోసం నటన మాత్రమే. కృతి స్వతహాగా సిగరెట్ స్మోక్ చేస్తుందా లేదా? అనేదానిపై ఎలాంటి క్లూ లేదు.
కృతి నటించిన తేరే ఇష్క్ మే ఇటీవలే థియేటర్లలోకి విడుదలైంది. ధనుష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. తొలి వీకెండ్ చక్కని వసూళ్లను అందుకుంది. ఆనంద్ ఎల్ రాయ్ ఈ జంటను తెరపై అందంగా చూపించారని ప్రశంసలు కురిసాయి. తేరే ఇష్క్ మే తొలి రోజున రూ. 16 కోట్లు ఆర్జించగా, శనివారం రూ. 17 కోట్లతో, ఆదివారం రూ. 18.75 కోట్ల వసూళ్లతో చక్కని గ్రాఫ్ ని మెయింటెయిన్ చేసింది. ఈ చిత్రం మొదటి వారాంతంలో రూ. 51.75 కోట్ల వసూళ్లతో ఫర్వాలేదనిపించింది.
తేరే ఇష్క్ మెయిన్ కథ ఎమోషనల్ డెప్త్ ఉన్నది. ఒక తిరుగుబాటు దారుడైన యువకుడిని ప్రేమించిన యువతి పడే కష్టనష్టాలను, బ్రేకప్ లోని బాధను తెరపై ఆవిష్కరించడంలో ఆనంద్ ఎల్ రాయ్ పనితనం కనిపించిందని ప్రశంసలు కురిసాయి. ఒక విధ్వంశం.. ఒకానొక బాధాకరమైన సంఘటనలో కృతి సిగరెట్ వెలిగిస్తున్న వీడియో గ్లింప్స్ ని కూడా ఆనంద్ ఎల్ రాయ్ ప్రమోషన్స్ లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ యూనిక్ వీడియో నుంచి ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. నిజ జీవితంలో ఫ్రస్టేషన్ కి గురైనప్పుడు కృతి సిగరెట్ తాగుతుందా? అంటూ అభిమానుల్లో అనుమానాలను రాజేసింది ఈ స్టిల్.