కృతిసనన్ పై మహేష్ ఫ్యాన్స్ ట్రోల్స్.. స్పందిస్తుందా?
ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ చేసిన పనికి టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అభిమానులు మండిపడటమే కాకుండా ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.;
అప్పుడప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు సెలబ్రిటీలు చేసే కామెంట్లు అనుకోకుండా ట్రోల్స్ కి గురయ్యేలా చేస్తూ ఉంటాయి. తెలిసో తెలియకో చేసే కామెంట్లు వారిపై సోషల్ మీడియాలో పూర్తి నెగిటివిటీ క్రియేట్ చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ చేసిన పనికి టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అభిమానులు మండిపడటమే కాకుండా ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. కెరీర్ ను ఇచ్చిన హీరోనే ఎలా మరిచిపోతావా? అంటూ ఆమెపై మండిపడుతూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది కృతి సనన్. తెలుగులో తొలిసారి మహేష్ బాబు హీరోగా నటించిన 1: నేనొక్కడినే అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ముఖ్యంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా ఈ సినిమాలో నటించిన కృతి సనన్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాతే బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ సినిమాలో కూడా సీత పాత్ర పోషించింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిన కృతి సనన్.. తాజాగా ధనుష్ తో కలిసి 'తేరే ఇష్క్ మే' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఎత్తు ప్రధాన అంశంగా మారింది అని చెప్పవచ్చు. ఆమె చాలా పొడవుగా ఉందని హోస్ట్ ప్రస్తావించడంతో పాటూ అలాగే ఆమెతో పనిచేసిన చాలామంది నటులు ఆమె కంటే పొట్టిగా ఉండడం గురించి కూడా ప్రస్తావించారు.
దీంతో కృతి సనన్ మాట్లాడుతూ.. "మీరు చెప్పింది నిజమే. ముఖ్యంగా చాలా తక్కువ మంది హీరోలు నాకంటే ఎత్తుగా ఉంటారు. ముఖ్యంగా ప్రభాస్, అర్జున్ కపూర్ లాంటి హీరోలు నాకంటే ఎత్తుగా ఉంటారు"అంటూ ఆమె కామెంట్ చేసింది.
ఇకపోతే ప్రభాస్ , అర్జున్ కపూర్ లను మాత్రమే ప్రస్తావించడంతో మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు.. ఎందుకంటే ఈమె ఇప్పటికే మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే సినిమా కోసం కలసి పనిచేసింది. ఈ విషయాన్ని పూర్తిగా మరిచిపోయినట్లు అనిపిస్తోంది. పైగా బాలీవుడ్ లో స్థిరపడడానికి ముందే కృతి మహేష్ బాబుతో సినిమా చేసింది. పైగా తన మొదటి సినిమానే మహేష్ లాంటి సూపర్ స్టార్ సరసన నటించడం కచ్చితంగా చిరస్మరణీయమైన సందర్భం. అయితే ఇలాంటి విషయాన్ని ఆమె ఎందుకు మరిచిపోయింది. ఒక సూపర్ స్టార్ ను ఎందుకు ఆమె ప్రస్తావించలేదు అంటూ అభిమానులు మండిపడుతున్నారు.
ఇకపోతే ఒక స్టార్ ను ఎలా మర్చిపోగలరు అని కొంతమంది ట్రోల్స్ చేస్తుంటే.. మరి కొంతమంది పొరపాటున ఆమె మరిచిపోయి ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.. ఏది ఏమైనా మహేష్ బాబు అభిమానులు మాత్రం కృతి సనన్ ను భారీగా ట్రోల్ చేస్తున్నారని చెప్పాలి. మరి దీనిపై ఆమె త్వరలోనే ఏదైనా ఒక పోస్ట్ పెడుతుందేమో చూడాలి .