కాక్‌టెయిల్ 2 కంటే ముందే కృతి బిగ్ విన్!

మేర ఎక్స్‌ట్రా వాల్యూ లభించింది. అంటే పెట్టుబడిపై 100%కి పైగా రాబడి వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు.

Update: 2026-06-12 19:30 GMT

కేవలం సినిమాల ద్వారానే కాదు, తెలివైన పెట్టుబడుల ద్వారా కూడా సంపదను పెంచుకోవచ్చని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ మరోసారి నిరూపించింది. ఇటీవల ఆమె కుటుంబం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చేసిన ఒక డీల్ ఇప్పుడు సినీ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు పదేళ్ల క్రితం కొనుగోలు చేసిన నాలుగు అపార్ట్‌మెంట్లను అమ్మ‌డం ద్వారా కృతి ఫ్యామిలీ రూ.4.5 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించినట్లు సమాచారం. కృతి సనన్, ఆమె సోదరి నుపుర్ సనన్, తల్లి గీత సనన్ కలిసి ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న రహేజా క్లాసిక్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నాలుగు అపార్ట్‌మెంట్లను విక్రయించారు. ఈ ఆస్తులను ప్రముఖ ఫిల్మ్‌మేకర్, కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24, 2026న నాలుగు వేర్వేరు డీల్స్ ద్వారా ఈ లావాదేవీలు పూర్తయ్యాయి.

వివరాల ప్రకారం, రెండు పెద్ద అపార్ట్‌మెంట్లు ఒక్కోటి రూ.3.23 కోట్లకు విక్రయించగా, మరో రెండు చిన్న యూనిట్లు ఒక్కోటి రూ.1.21 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం నాలుగు ఆస్తుల విలువ రూ.8.9 కోట్లుగా నమోదైంది. అయితే ఈ డీల్‌లో ఇంట్రెస్టింగ్ విష‌యమేంటంటే, ఈ అపార్ట్‌మెంట్లను సనన్ ఫ్యామిలీ 2013 నుంచి 2017 మధ్య కాలంలో మొత్తం రూ.4.31 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం అమ్మిన‌ ధరతో పోలిస్తే దాదాపు రూ.4.6 కోట్ల

మేర ఎక్స్‌ట్రా వాల్యూ లభించింది. అంటే పెట్టుబడిపై 100%కి పైగా రాబడి వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు.

ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కృతి సనన్ కూడా ఆ దిశగా బలమైన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నాలుగు అపార్ట్‌మెంట్ల విక్రయం జరిగినప్పటికీ, ఆమె ముంబైలోని ప్రీమియం ప్రాపర్టీల్లో పెట్టుబడులను కొనసాగిస్తోందని సమాచారం. ముఖ్యంగా గతేడాది ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన పాలి హిల్‌లో సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న లగ్జరీ డూప్లెక్స్ పెంట్‌హౌస్‌ను రూ.78 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ డీల్ అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అంతేకాకుండా అలీబాగ్ ప్రాంతంలో సుమారు 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రీమియం ప్లాట్‌ను కూడా కృతి కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆమె ఇన్వెస్టిమెంట్ ప్లాన్ కేవలం సినీ ఆదాయంపైనే కాకుండా దీర్ఘకాలిక ఆస్తుల నిర్మాణంపైనా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం కృతి సనన్ నటించిన కాక్‌టెయిల్ 2 రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించగా, సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా సంపదను పెంచుకుంటున్న కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత తెలివైన సెలబ్రిటీ ఇన్వెస్టర్లలో ఒకరిగా నిలుస్తోంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News