సరికొత్త అనుభూతి సెట్స్ డేస్ ను గుర్తుచేసుకున్న సీత‌మ్మ‌!

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'కాక్‌టెయిల్ 2' లో ఓ హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-06-09 10:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'కాక్‌టెయిల్ 2' లో ఓ హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ పూర్తి కావ‌డంతో? అమ్మ‌డు ఈ సినిమా ప్రమోష‌న్స్ తో వార్తల్లో నిలుస్తోంది. షూటింగ్ ప్రక్రియ పూర్తయి సినిమా విడుదలకు సిద్ద‌మ‌వుతున్నా? తాను మాత్రం ఇంకా మానసికంగా ఆ షూటింగ్ తాలూకు జ్ఞాపకాల్లోనే విహరిస్తున్నానని తాజాగా వెల్లడించింది. సహ నటుడు షాహిద్ కపూర్‌తో కలిసి సెట్స్‌పై గడిపిన అద్భుతమైన క్షణాలు తనను ఇంకా వదిలిపెట్టడం లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే కృతి సనన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కాక్‌టెయిల్ 2 సెట్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన తెరవెనుక వీడియో ను అభిమానులతో పంచుకుంది.

'మానసికంగా నేను ఇంకా అక్కడే ఉన్నాను' అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ ముగిసినా? ఆ పాత్ర తాలూకు ప్రభావం .. సెట్స్‌లో జరిగిన సందడి నుండి తాను ఇంకా బయటకు రాలేకపోతున్నానని వీడియో ద్వారా బ‌య‌ట‌ప‌డింది. కృతి స‌న‌న్ పంచుకున్న ఈ వైబ్రంట్ వీడియో రీల్‌లో చిత్ర బృందం ఎంత సరదాగా గడిపిందో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని హై-ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ `మై నాచూ జబ్ తక్ తూ బోలే` పాట చిత్రీకరణ సమయంలో తీసుకున్న విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

బీచ్-పార్టీ నేపథ్యంతో సాగే ఈ పాట కోసం కృతి సనన్ గ్లామరస్ లుక్స్‌లో మెరిసిపోగా.. హీరో షాహిద్ కపూర్ కూడా ఎంతో జోష్‌తో స్టెప్పులు వేసారు. షూటింగ్ విరామ సమయంలో షాహిద్ కపూర్- కృతి సనన్ మధ్య జరిగిన నవ్వుల సంభాషణలు, రిహార్సల్స్ , నవ్వుకున్న క్షణాలు ఈ వీడియోలో క్యాప్చర్ అయ్యాయి. ఇద్ద‌రి మధ్య ఉన్న ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ .. స్నేహం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ మాంటేజ్ వీడియోలో సహనటి రష్మిక మందన్న -దర్శకుడు హోమీ అదజానియా కూడా సందడి చేసారు.

రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న `కాక్‌టెయిల్ 2` చిత్రం ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది 2012లో విడుదలై ఘనవిజయం సాధించిన `కాక్‌టెయిల్` చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. ఈ కొత్త వెర్షన్‌లో కృతి సనన్ ఎంతో స్వతంత్ర భావాలు కలిగిన గ్లామరస్ పాత్రలో నటిస్తుండగా, షాహిద్ కపూర్ రొమాంటిక్ రోల్ తో అద‌ర గొట్ట‌నున్నాడు. ఒక నటిగా సినిమా షూటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఆ వాతావరణాన్ని, తోటి నటీనటులతో ఏర్పడిన బంధాన్ని మనస్ఫూర్తిగా హత్తుకోవడం కృతి సనన్‌కు సినిమా పట్ల ఉన్న అంకితభావాన్ని సూచిస్తుంది. కేవలం కెమెరా ముందే కాకుండా కెమెరా వెనుక కూడా అంతటి సానుకూల వాతావరణం ఉండటం వల్లే మంచి అవుట్‌పుట్ సాధ్యమవుతుందని ఈ గ్లామరస్ బ్యూటీ మాటలను బట్టి అర్థమవుతోంది.



Tags:    

Similar News