ట్రెడిషనల్ లుక్స్ లో కృతి అందాల మాయ
లేటెస్ట్ గా కృతిశెట్టి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫ్రెష్ బ్రీజ్‌లా కనిపిస్తున్నాయి.;
లేటెస్ట్ గా కృతిశెట్టి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫ్రెష్ బ్రీజ్‌లా కనిపిస్తున్నాయి. ప్యాషన్ ప్రపంచంలో తనదైన మార్క్ వేసుకుంటున్న కృతి, లైట్ బ్లూ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌లో సింప్లిసిటీకి సెన్సిబిలిటీని జోడించి, స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఆమె వేసుకున్న బ్యూటిఫుల్ జ్యువెలరీ, క్లోజ్ అప్ కెప్చర్స్ లో ఎక్స్‌ప్రెషన్స్‌ను ఎలివేట్ చేస్తూ, ఆమె నేచురల్ గ్లో, క్యూట్ స్మైల్ కి మిలియన్ డాలర్ అటిట్యూడ్ జతయ్యింది.
ఫోటోలలో కృతి ఒకసారి మాయాజాలంలా చూస్తే, ఇంకోసారి మనసుకు హత్తుకునేలా స్మైలిస్తూ చూపించింది. ట్రెడిషనల్ దుస్తుల్లోనూ ఎంతగా స్టైలిష్ గా కనిపించొచ్చో, ప్రూవ్ చేసింది. కళ్లలో ఉన్న ఎమోషన్, ముఖంలో కనిపించే ఫ్రెష్‌నెస్ ఆమె ఫొటోలకు స్పెషల్ ఫీల్ తీసుకొచ్చింది. జువెలరీ, మేకప్, హెయిర్ స్టైల్ అన్నింటిలోనూ ఒక సాఫ్ట్ టచ్ కనిపిస్తోంది. ఫోటోగ్రఫీ, స్టైలింగ్ పరంగా కూడా ఆమె టీమ్ హైలెట్ అయింది.
కృతిశెట్టి కెరీర్ విషయానికి వస్తే, ఆమె 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగారాయ్’, ‘బంగార్రాజు’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లాంటి సినిమాల్లో నటించి, యూత్ ఆడియన్స్‌కు చేరువ అయింది. హిట్ ఆఫర్లతో పాటు, వరుసగా స్టార్ హీరోలతో కూడా అవకాశం అందుకుంటోంది. కానీ ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు మిక్స్‌డ్ టాక్ రావడంతో, ఆమెకు హిట్ సినిమా అవసరం అయిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇటీవలే మోడ్రన్ గ్లామర్ ఫోటోషూట్‌లు షేర్ చేస్తూ, యువతను, ఫ్యాషన్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది కృతి. రొటీన్ స్టైలింగ్‌కు భిన్నంగా, ట్రెడిషనల్ వేర్‌లో కూడా తనదైన మార్క్ చూపిస్తోంది. ఫ్యాన్స్ కామెంట్స్‌లో ఆమె న్యాచురల్ బ్యూటీని, నవ్వును ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. ఇక అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌తో పాటు ఇలాంటి యునిక్ ఫొటోషూట్లతో కృతిశెట్టి తన మార్క్‌ను మరింత బలపర్చేందుకు ప్రయత్నిస్తోంది.