హోటల్ గదిలో దెయ్యాన్ని చూసానన్న నటి
ఈ ప్రపంచంలో దెయ్యాలు భూతాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు దెయ్యం ఉందని కూడా నమ్మాలి అని అంటారు.;
ఈ ప్రపంచంలో దెయ్యాలు భూతాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు దెయ్యం ఉందని కూడా నమ్మాలి అని అంటారు. చాలా మంది తాము ఆత్మలతో మాట్లాడాని, వాటిని చూసామని చెప్పినప్పుడు ఆశ్చర్యపోకుండా ఉండలేం. అధునాతన సాంకేతిక సమాజంలో ఇంకా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయా? అని వ్యతిరేకించేవారు లేకపోలేదు.
అయితే ఆత్మల విషయంలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయి. సెలబ్రిటీలు, సామాన్యులలోను ఇలాంటి అనుభవాలు ఉన్నాయని బహిరంగంగా చెప్పిన వారిని చూసాం. ఇప్పుడు యంగ్ బ్యూటీ కృతి శెట్టి తాను ఉంటున్న హోటల్ గదిలో ఆత్మను చూసానని చెప్పడం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ భామ కార్తీ కథానాయకుడిగా నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వా వాతియార్` అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు కేటాయించిన హోటల్ గదిలో దెయ్యాన్ని చూసానని కృతి శెట్టి తెలిపింది. ఇందులో జిప్సీ -స్పిరిట్ రీడర్ పాత్ర పోషిస్తోంది కృతి. షూటింగ్ ప్రారంభించడానికి ఒక రోజు ముందు తాను నిజంగా ఒక ఆత్మను చూశానని కృతి వెల్లడించింది!
తమిళంలో బ్యాక్ టు బ్యాక్ మూడు పెద్ద రిలీజ్ ల కోసం వేచి చూస్తున్న కృ శెట్టి తాజా చిత్రం వా వాతియార్ గురించి మీడియాతో మాట్లాడింది. నేను నలన్ సర్ సినిమాలో జిప్సీ స్పిరిట్ రీడర్ పాత్రను పోషిస్తున్నాను. స్పిరిట్ రీడర్ అంటే ఆత్మలతో అనుసంధానమై ఉండే పాత్ర. అతీంద్రియ శక్తులపై సినిమా ఇది. ఇందులో నా పాత్ర మొత్తం సినిమాకే ప్రత్యేక వైబ్ ని తెస్తుంది. వింతైనది అయినా ఇలాంటి పాత్రను పోషించడం ఉత్సాహం నింపింది. నేను భారతీయ సినిమాలో అంతగా చూడని పాత్ర ఇది`` అని కృతి తెలిపింది.
మీరు ఆత్మలను నమ్ముతారా? అలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురయిందా? అని ప్రశ్నించగా, తాను ఆత్మలను నమ్ముతానని కృతి పేర్కొంది. ఎందుకంటే నేను తుళు. మేము మా పూర్వీకులను ప్రార్థిస్తాము. వారు ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్నారని, మా సంరక్షక దేవదూతల వలె మమ్మల్ని రక్షిస్తారని మేము నమ్ముతాము. కాబట్టి నేను ఖచ్చితంగా ఆత్మలను నమ్ముతాను అని చెప్పింది. నేను షూటింగుకు వెళ్లిన ముందు రోజు రాత్రి నాకు ఏదో అయింది. అది నాలో ఆత్మలపై మరింత నమ్మకం కలిగించింది. నా హోటల్ గదిలో ఒక ఆత్మను చూశాను. ఆరోజు అది చాలా వింతగా అనిపించింది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందా లేదా నేను నేర్చుకుంటున్నప్పుడు.. పాత్రగా మారే ప్రక్రియలో ఏదో చేయడం వల్ల వచ్చిందా? అనేది నాకు కచ్చితంగా తెలియదు`` అని చెప్పింది.
నేను ఆత్మ ముఖాన్ని చూడలేదు కానీ, శరీరాన్ని చూసాను. ఆ వ్యక్తిని చూసాను. లైట్ ఆన్ చేసినప్పుడు, ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఇది ఏదో అతీంద్రియ శక్తి అని తెలుసుకుని అమ్మా- నేను ఒకరినొకరు చూసుకున్నాము అని ఆ ఘటనను కృతి గుర్తుచేసుకుంది. తాను చేయబోయే పాత్రపై ఇప్పుడు మరింత నమ్మకం పెరిగిందని కూడా తెలిపింది. నిజానికి ఆ ఆత్మకు ధన్యవాదాలు. ఎందుకంటే మేం ఆత్మలను చూసామని.. మాట్లాడామని చెబితే ప్రజలు నమ్మరు కదా! అందుకే ఆ అనుభవం నాకు చాలా సహాయపడింది. ఈ చిత్రానికి ముందు అలాంటి అనుభవం నాకు లేదు. కానీ ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. కాబట్టి ఇది నా పాత్రపై నా నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని కృతి తెలిపింది.
ఈ చిత్రంలో కార్తీ పోలీసు అధికారిగా నటిస్తున్నారు.. కరుణాకరన్ అతడి అసిస్టెంట్ గా పని చేసారు. సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జి ఎం సుందర్, రమేష్ తిలక్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్. ఆసక్తికరంగా, ఈ చిత్రానికి కుమారస్వామితో కలిసి రామ్స్ మురుగన్, నవకాంత్ రాజ్‌కుమార్, సుందర్ వెంకట్ అనే ముగ్గురు సహ దర్శకులు పని చేస్తున్నారు.