అతనే నా ఫేవరెట్ హీరో
తెలుగు సినీ పరిశ్రమలో ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, ప్రస్తుతం తన కెరీర్‌లో కీలక దశను ఎదుర్కొంటోంది.;
తెలుగు సినీ పరిశ్రమలో ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, ప్రస్తుతం తన కెరీర్‌లో కీలక దశను ఎదుర్కొంటోంది. త్వరలోనే ఆమె నుంచి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా రాబోతుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న కృతి, తన వ్యక్తిగత అభిరుచుల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
ముఖ్యంగా తనకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్నకు కృతి ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని ఆమె స్పష్టంగా వెల్లడించింది. చరణ్ గారి సినిమాలన్నీ చూస్తుంటాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇది అందరికీ తెలిసిందే అంటూ కృతి ఓపెన్ గా చెప్పడం మెగా ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుండగా, ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కృతి శెట్టి కెరీర్ విషయానికి వస్తే, ఆమె మొదటి సినిమా ఉప్పెన భారీ విజయాన్ని సాధించి ఆమెను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. మొదటి సినిమానే బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలొచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే ఆశించిన ఫలితాన్ని అందించాయి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు తప్ప మిగిలిన ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
ఈ ఫలితాల ప్రభావంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు తగ్గగా, దీంతో కృతి తన కెరీర్‌ను కొత్త దిశగా మలచుకునే ప్రయత్నంలో భాగంగా కోలీవుడ్ వైపు దృష్టి మళ్లించింది. తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అందులో భాగంగానే ఆమె కార్తీ సరసన వా వాతియార్ ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ కృతి వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది.
కాగా ప్రస్తుతం కృతి ఆశలన్నీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పైనే పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్‌కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆమె భావిస్తోంది. కొత్త కథ, కొత్త టీమ్‌తో వస్తున్న ఈ సినిమా ద్వారా ఆమె మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే, కెరీర్ స్టార్టింగ్ లో భారీ విజయాన్ని అందుకున్న కృతి శెట్టి ఇప్పుడు తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కష్టపడుతోంది.