కృతికి ఈసారైనా కలిసొస్తుందా?
కృతి శెట్టి. తెలుగు ఆడియన్స్ కు ఈ పేరు తెలియని వారుండరు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు.;
కృతి శెట్టి. తెలుగు ఆడియన్స్ కు ఈ పేరు తెలియని వారుండరు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఉప్పెన హిట్ తో కృతికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే అమ్మడికి మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు మంచి ఫలితాల్నే ఇచ్చాయి.
వరుస ఫ్లాపులతో తెలుగులో తగ్గిన అవకాశాలు
కానీ ఆ తర్వాత కృతి చేసిన సినిమాలన్నీ వరుసగా నిరాశ పరుస్తూ వచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే ఇలా ఆమె చేసిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపులుగా నిలవడంతో క్రమంగా కృతికి తెలుగులో అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. శర్వానంద్ తో చేసిన మనమే సినిమానే కృతి తెలుగులో చేసిన ఆఖరి సినిమా.
వేరే భాషలపై కృతి ఫోకస్
తెలుగులో అవకాశాలు తగ్గడంతో కృతి వేరే భాషలపై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే తమిళంలో ఓ రెండు సినిమాలకు సైన్ చేసింది. అనుకున్నట్టే తమిళంలో కృతికి మంచి అవకాశాలే వచ్చాయి. కార్తీ హీరోగా వా వాతియార్ చేయగా, ఎన్నో వాయిదాల తర్వాత రీసెంట్ గా పొంగల్ కు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్డ్స్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో హీరోయిన్ గా ఛాన్స్
వా వాతియార్ కాకుండా కృతి చేతిలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా కూడా ఉంది. కోలీవుడ్ యూత్ స్టార్ ప్రదీప్ రంగనాథ్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రదీప్ సినిమాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అతను చేసే సినిమాల్లో నటించే హీరోయిన్లకు కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. లవ్ టుడే తో ఇవానా మంచి క్రేజ్ అందుకోగా, డ్రాగన్ తర్వాత కయదు లోహర్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఫిబ్రవరి 14న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్
ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత తనకు కూడా అదే తరహా ఫాలోయింగ్, క్రేజ్ వస్తాయని కృతి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. కృతి ఇప్పుడు తన ఆశలన్నింటినీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. కృతి తమిళ డెబ్యూ సినిమా వా వాతియార్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన నేపథ్యంలో ఈ సినిమా అయినా అమ్మడి ఆశను నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి.