డెబ్యూ ప్రాజెక్టుతో రిస్క్ చేస్తున్న హీరోయిన్
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, మిలాప్ జవేరి కలయికలో ఓ యాక్షన్ పాక్డ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.;
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, మిలాప్ జవేరి కలయికలో ఓ యాక్షన్ పాక్డ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి ట్రాక్ రికార్డు గత కొన్ని సినిమాలుగా ఏమంత బాలేదు. బాఘీ4, బడే మియా చోటే మియా, గణపత్ లాంటి సినిమాలు ఫ్లాపైన తర్వాత టైగర్ ష్రాఫ్ మార్కెట్ బాగా డల్ అయింది. అందుకే ఈ సినిమాతో అయినా టైగర్ ష్రాఫ్ కెరీర్ లో కంబ్యాక్ ఇస్తారా లేదా అని అందరూ అనుమానపడుతున్నారు.
ఇక మిలాప్ జవేరి కూడా ఈ మధ్య ఫ్లాపుల్లోనే ఉన్నారు. మస్తీ4 సినిమా ఫ్లాప్ గా నిలవగా, ఏక్ దీవానే కీ దీవానియత్ సినిమాతో ఓ మోస్తరు సక్సెస్ దక్కినప్పటికీ, సినిమాను చూసిన చాలా మంది ఆడియన్స్ దాన్ని క్రింజ్ అంటూ ట్రోల్ చేశారు. అలాంటి వారిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
సూపర్30లో నటించిన కృతి
ఇదిలా ఉంటే ఇలాంటి సినిమాతో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. కృతి ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేయగా, ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్తున్నారు. గతంలో కృతి హృతిక్ రోషన్ సూపర్30 లో నటించినప్పటికీ అందులో కృతి లీడ్ రోల్ చేయలేదు. అందుకే కృతి ఈ సినిమాతోనే బాలీవుడ్ డెబ్యూ చేయనుందని అందరూ భావిస్తున్నారు.
టైగర్ ష్రాఫ్ డెబ్యూ హీరోయిన్ల ట్రాక్ రికార్డ్
అయితే ఈ విషయంలో కృతి డెసిషన్ కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. టైగర్ ష్రాఫ్, మిలాప్ జవేరి కలిసి తీస్తున్న సినిమా ద్వారా కృతి డెబ్యూ జరిగితే అది తన ఫ్యూచర్ ఛాన్సులకు హాని కలిగిస్తుందని అనుకుంటున్నారు. పైగా ఇప్పటివరకు టైగర్ ష్రాఫ్ తో కలిసి డెబ్యూ చేసిన హీరోయిన్ల ట్రాక్ రికార్డు చూసుకుంటే, కృతి రిస్క్ తీసుకుంటున్నట్టే అనిపిస్తోంది.
ఓ వైపు టైగర్ ష్రాఫ్, మరోవైపు మిలాప్ జవేరి ఇద్దరూ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న టైమ్ లో, కృతి ఈ మూవీతో కాకుండా కాస్త వెయిట్ చేసి ఏదైనా మంచి సినిమాతో డెబ్యూ జరిగితే బావుండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు. కానీ కొందరు మాత్రం కృతినే టైగర్ ష్రాఫ్ యొక్క ఫ్లాప్స్ స్ట్రీక్ కు ఫుల్ స్టాప్ పెట్టి, అతనికి లక్కీ హీరోయిన్ గా మారుతుందేమో అని ఆశ పడుతున్నారు.