• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో హీరో కోసం వీరమల్లు...

మరో హీరో కోసం వీరమల్లు డైరెక్టర్.. ప్లాన్ చేంజ్

| టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి క్రిష్.

By - Tupaki Desk
Update: 2023-08-06 11:29 GMT

టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి క్రిష్. మొదటి సినిమా గమ్యం నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న హరిహర వీరమల్లు వరకు క్రిష్ చేసే ప్రతి మూవీ కూడా డిఫరెంట్ జోనర్ లోనే ఉంటాయి. కథాబలం ఉన్న చిత్రాలు చేయడంలో క్రిష్ ముందుంటారు పవన్ కళ్యాణ్ తో హరి హరవీరమల్లు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యి రెండేళ్లు అవుతుంది.

కానీ ఇప్పటికి పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల కారణంగా ఎక్కువ డేట్స్ ఈ చిత్రానికి కేటాయించకపోవడం వలన మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం పవన్ 2024 ఎన్నికలకి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాకి ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఎన్నికల తర్వాత మరల ఆ చిత్రం మొదలు కానుంది. అయితే క్రిష్ ఇంతలో లోబడ్జెట్ మూవీ ఒకటి పూర్తి చేయాలని అనుకుంటున్నారంట.

దానికోసం ఇప్పటికే తన దగ్గర ఉన్న కథని బయటకి తీసి కంప్లీట్ స్క్రిప్ట్ గా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథకి సరిపోయే హీరో కోసం క్రిష్ ప్రయత్నం చేస్తున్నారంట. వీలైనంత తక్కువ టైంలో కంప్లీట్ చేసి వచ్చే ఏడాదికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ప్రస్తుతం యువ హీరోలు అందరూ కూడా ఒకటి, రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యి బిజీగా ఉన్నారు.

ఎలాంటి టైంలో క్రిష్ తో సినిమా చేయడానికి ఎవరు ముందుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. క్రిష్ దర్శకత్వంలో సినిమా అంటే కచ్చితంగా ఎక్స్ పరమెంట్ కి రెడీ కావడమే. అలాంటి డేరింగ్ ఎవరు చేస్తారనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఒక వేళ ఒప్పుకుంటే మాత్రం కచ్చితంగా సదరు హీరోగా ఆ మూవీ యాక్టర్ మంచి గుర్తింపు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది.

ప్రస్తుతం క్రిష్ లిస్ట్ లో ఓ ఇద్దరు పేర్లు ఉన్నాయంట. వారిలో ఒకరితో చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. అయితే అతను ఎవరనేది మాత్రం బయటకి రాలేదు. త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందంట.

Tags:    
  • KrishJagarlamudi 
  • HariHaraVeeramalu 
  • Tollywood 
  • MovieNews 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS