• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ కృష్ణ ఖైదీ...

సూపర్ స్టార్ కృష్ణ ఖైదీ ఎలా మిస్ అయ్యారు.. బ్యాక్ స్టోరీ ఏంటి..?

| ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణకు ఎన్నో ఏళ్లుగా పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేసిన మాధవ రావు రీసెంట్ గా ఇంటర్యూ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2023-11-15 14:30 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు గురించి అందరికీ తెలిసిందే. ప్రతి విషయంలో పరిశ్రమ ఎదుగుదలకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చేసిన సినిమాలు పరిశ్రమకు ఎంతో మేలు చేశాయి. చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోతుంది. అంత గొప్ప నటుడు మంచి మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్లి అప్పుడే ఏడాది గడిచింది. సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణకు ఎన్నో ఏళ్లుగా పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేసిన మాధవ రావు రీసెంట్ గా ఇంటర్యూ ఇచ్చారు. సూపర్ స్టార్ గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తనకు వచ్చిన అవకాశాలను కూడా వేరే నటులకు ఇవ్వాలని సలహా ఇచ్చేవారట కృష్ణ. అలా ఆయన వదులుకున్న సినిమా చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఖైదీ ఒకటి.

ఖైదీ సినిమా స్క్రిప్ట్ సూపర్ స్టార్ కృష్ణ దగ్గరకు వచ్చిందట. కానీ కృష్ణ గారు మాత్రం చిరంజీవిని తీసుకోవాలని చెప్పారట. చిరంజీవి డ్యాన్స్ బాగా చేస్తాడు.. అతడినే ఈ సినిమాలో తీసుకోవాలని సూపర్ స్టార్ కృష్ణ చెప్పారట. అలా కృష్ణ గారు చెప్పారని ఖైదీ సినిమా చిరంజీవితో తీశారు. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయం దక్కించుకుంది. ఇదే కాదు రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన కటకటాల రుద్రయ్య సినిమా కోసం కూడా ముందు కృష్ణ గారిని సంప్రదించగా ఆయన ఈ కథ కృష్ణంరాజుకి అయితే బాగుంటుందని చెప్పారట.

అలా తన దగ్గరకు వచ్చిన కథలు బాగున్నా సరే తనకన్నా వేరే వాళ్లైతే బాగుంటుందని చెప్పి సజస్ట్ చేశారట కృష్ణ. ఒక మంచి కథను వేరే హీరోకి ఇస్తే హిట్ పడుతుందని తెలిసినా తన మంచి మనసుతో తోటి నటీనటులకు కూడా మంచి సక్సెస్ రావాలని ఆశించే నిస్వార్ధమైన మనసు కలిగిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అందుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన హీరోగా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మహేష్ బాబు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆన్ స్క్రీన్ మంచి సినిమాలే కాదు ఆఫ్ స్క్రీన్ మంచి పనులతో మనసులు గెలుస్తున్నాడు మహేష్.

Tags:    
  • Tollywood 
  • Staractor 
  • Superstar 
  • Krishna 
  • Madhavarao 
  • Makeup 
  • Interview 
  • Khaidi 
  • Movie 
  • Chiranjeevi 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS