అక్కినేని ఇంటి కెళ్ళి షాక్ ఇచ్చిన క్రిష్ణ
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ క్రిష్ణ ది ఒక శకం. ఆయన మార్క్ ప్రత్యేకం. ఆయన తీసిన సినిమాలు చేసిన సాహసాలు ఒక స్పెషల్.;
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ క్రిష్ణ ది ఒక శకం. ఆయన మార్క్ ప్రత్యేకం. ఆయన తీసిన సినిమాలు చేసిన సాహసాలు ఒక స్పెషల్. ఇదిలా ఉంటే ఒకే సమయంలో అప్పటి దిగ్గజ నటులు ఎన్టీఆర్ అక్కినేనిలతో పోటీ పడి మరీ నెగ్గుకొచ్చిన ఘనత క్రిష్ణ కే సొంతం. అల్లూరి సీతారామ రాజు ఎన్టీఆర్ డ్రీం ప్రాజెక్ట్ ని తీసి మరీ బంపర్ హిట్ కొట్టిన క్రిష్ణ ఆ వెంటనే అక్కినేని క్లాసిక్ మూవీ దేవదాస్ ని రీమేక్ చేసి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. మాస్ హీరోగా అప్పటికే ఎదిగిన క్రిష్ణ దేవదాస్ గా నటించడం ఒక విశేషం అయితే ఆ మూవీని టెక్నికల్ గా అద్భుతంగా తీసి తన స్టైల్ ఏంటో చూపించారు.
ఓకే అనిపించుకుంది :
అయితే పాత దేవదాసు ని ఆ సమయంలో రిలీజ్ చేయడంతో రెండింటి మధ్యన పోలిక వచ్చి జనాలు క్రిష్ణ దేవదాస్ ని కాస్తా పక్కన పెట్టినా హీరో క్రిష్ణ ప్రయోగం కూడా ఓకే అని తరువాత కాలంలో అంతా అన్నారు. ఆ మూవీని రంగులతో హంగులతో తీసిన క్రిష్ణ కాలానికి తగినట్లుగా మార్పులు చేశారు. పాటలు కూడా బాగా క్రిష్ణ దేవదాస్ లో ఉంటాయి. అలాగే మంచి స్క్రీన్ ప్లే, సంభాషణలు కధనం అన్నీ కూడా కొత్త దేవదాస్ లో బాగానే ఉన్నాయని తరువాత రోజులలో చెప్పుకున్న మాట.
మాట్లాడుకోవడాలు లేవు:
సరే క్రిష్ణ దేవదాస్ తీసి సాహసం చేశారు. ఆ మీదట అక్కినేనితో క్రిష్ణకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అంతకంటే లేవు అన్న దాకా సీన్ వచ్చేసింది. ఇక చూస్తే అక్కినేని అమెరికాలో ఆపరేషన్ చేసుకుని హైదరాబాద్ లో ఉంటూ తన సినిమాల బిజీలో గడిపేవారు. క్రిష్ణ మద్రాస్ లో ఉంటూ ఏమైనా తన సినిమాల షూటింగులు ఉంటే వాటి కోసం అపుడపుడు హైదరాబాద్ వచ్చేవారు. సరిగ్గా ఈ సమయంలో ఒక సంఘటన జరిగింది.
శోభన్ బాబు అనుకుని :
కృష్ణ శోభన్ బాబు హీరోలుగా ఒక కధ అనుకుని తన సొంత నిర్మాణ సంస్థ మీద సినిమా తీయాలని క్రిష్ణ నిర్ణయించుకున్నారు. దాని కంటే ముందు శోభన్ నుంచే ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే తరువాత మల్లెపూవు సినిమా హిట్ కావడంతో శోభన్ బాబు ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పేశారు. దాంతో తన సినిమాలో అక్కినేనిని హీరోగా తీసుకోవాలని క్రిష్ణ భావించారు. అందుకోసం ఆయన ఏకంగా హైదరాబాద్ కి వెళ్ళి మరీ అక్కినేని వారి ఇంటికి నేరుగా వచ్చేశారు.
ఊహించని పరిణామం :
తన ఇంటికి నేరుగా క్రిష్ణ రావడం చూసిన అక్కినేని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దేవదాసు సినిమా గ్యాప్ ఇద్దరి మధ్య ఉంది. దాంతో బయటకు ఏమీ అనకపోయినా ఏం ఇలా వచ్చారు అంటూ క్రిష్ణను పలకరించారు. క్రిష్ణ విషయం చెప్పి తన మూవీలో హీరోగా నటించాలని కోరారు. తమ ఇద్దరి కాంబోలో మూవీగా చెప్పారు. నన్ను హీరో పెట్టి సినిమానా అని అక్కినేని సరదాగా నవ్వేసి నటిస్తాను కానీ కధ నచ్చాలి అని కండిషన్ పెట్టారుట. ఆ మీదట కధ చెప్పడం అది అక్కినేనికి నచ్చడంతో చకచకా సినిమా సెట్స్ మీదకు వచ్చింది. ఆ మూవీయే హేమా హేమీలు.
మంచి హిట్ తో :
వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న హేమా హేమీలు 1979 మార్చి 23 గా గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీలో అక్కినేని ద్విపాత్రాభినయం చేశారు. ఆయన పక్కన జరీనా వహబ్ నటిస్తే క్రిష్ణ పక్కన విజయనిర్మల హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి విజయనిర్మల దర్శకత్వం వహించారు. మొత్తం మీద దేవదాస్ రాజేసిన కలహానికి ఫుల్ స్టాప్ గా హేమాహేమీలతో మంచి హిట్ కొట్టి అక్కినేని క్రిష్ణ కలిసిపోయారు. వారి ఫ్యాన్స్ కూడా ఈ కలయికను చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు.