ఒకే నెలలో రెండు సినిమాలతో క్రిష్!
అయితే క్రిష్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు మాత్రం ఒకే నెలలో జరగడం యాధృశ్చికం. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ 'ఘాటీ' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.;
ఏ డైరెక్టర్ అయినా ఏడాదికి మహా అయితే రెండు..మూడు సినిమాలు తెరకెక్కించగలడు. కానీ వాటిని ఒకే ఏడాది రిలీజ్ చేయడం అన్నది చాలా కష్టమైన పని. స్టార్ హీరోతో సినిమా అయితే ఏడాదికి ఒకటి రిలీజ్ చేయడం కూడా కష్టంగా ఉన్న రోజులివి. దీంతో స్టార్ డైరెక్టర్లు అంతా ఏడాదికి ఒక సినిమానే రిలీజ్ అయ్యే లా చూసుకుంటారు. అది ఏ నెలలో జరుగుతుందో వాళ్లు కూడా గెస్ చేయలేరు.
అన్ని అనుకున్నట్లు జరిగితే రిలీజ్ కూడా అలాగే జరుగుతుంది. లేదంటే పరిస్థితి వీరమల్లులా ఉంటుంది. అయితే క్రిష్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు మాత్రం ఒకే నెలలో జరగడం యాధృశ్చికం. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ 'ఘాటీ' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిలే అయింది.
దీంతో ఎట్టకేలకు జూలై 11న రిలీజ్ తేదీ లాక్ చేసారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. క్రిష్- అనుష్క కాంబినేషన్ లో రిలీజ్ అవుతున్న రెండో చిత్రమిది. తొలిసారి ఇద్దరు 'వేదం' సినిమా కోసం పని చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరిహరవీరమల్లు' కూడా జూలై 24న రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రం కూడా క్రిష్ దర్శకత్వంలోనే ప్రారంభమైంది. కొద్ది భాగం షూటింగ్ చేసారు. ఆ తర్వాత సమయం వృద్ధా అవుతుందని ప్రాజెక్ట్ ను వదిలేసి బయటకు వచ్చేసారు. దీంతో మిగిలిన భాగం కోసం జ్యోతికృష్ణ పనిచేసాడు. అలా వీరమల్లులో క్రిష్ హస్తం కీలకంగా మారింది. డైరెక్టర్స్ గా క్రిష్ పేరు కూడా తెరపై కనిపించనుంది. ఇలా ఒకే నెలలో క్రిష్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం అతడి కెరీర్ లో ఇదే తొలిసారి. ఇలా రిలీజ్ అవ్వడం అన్నది క్రిష్ కి ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్.