పేరు మాత్రమేనా? హిట్ వస్తుందా? డైరెక్టర్ క్రిష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ రియాక్షన్?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Update: 2026-08-02 08:08 GMT

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన టేకింగ్ తో విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన క్రిష్ జాగర్లమూడి.. గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నారే కానీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ లభించడం లేదు. దీంతో ఆడియన్స్ అంతా ఆయన చిత్రాలకే పేరు వస్తుందా? లేక ఆయా చిత్రాలతో హిట్టు లభిస్తుందా? అనే కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ఎన్నో మంచి మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈయన.. చివరిగా హరిహర వీరమల్లు పార్ట్ వన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే అనుకోకుండా క్రిష్ ఆ సినిమా నుండి తప్పుకోవడం , జ్యోతీ కృష్ణ ఎంటర్ అవడం అన్నీ జరిగిపోయి. ఇక పార్టీ 2లో తాను చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని క్రిష్ చెప్పారు. కానీ అసలు హరిహర వీరమల్లు పార్ట్ 2 పట్టాలెక్కేది ఎప్పుడు? అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కొత్త నటీనటులతో క్రిష్ కొత్త ప్రయోగం..

ఇక చివరిగా ఘాటీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. క్రిష్ జాగర్లమూడి. ప్రముఖ సీనియర్ హీరోయిన్ అనుష్క ఇందులో లీడ్ రోల్ పోషించింది. ముఖ్యంగా ఆయన తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. కానీ ఆడియన్స్ ను మెప్పించడంలో క్రిష్ విఫలమయ్యారు అనే కామెంట్లు కూడా అప్పుడు వ్యక్తం అయ్యాయి . అయితే ఇప్పుడు తాజాగా.. ఆయన వినూత్న ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా పాత నటీనటులకు పూర్తిగా ఆస్కారం లేకుండా కేవలం కొత్త నటీనటులతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

చక చక జరిగిపోతున్న డబ్బింగ్ పనులు..

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రసాద్ ల్యాబ్ లో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటుంది. ఇక ఔట్ పుట్ బాగా వచ్చిందని, కథే ప్రధాన బలంగా ఉండేలా క్రిష్ కథను రూపొందించారని, సినిమా కూడా అంతే బలంగా తీశారని వార్తలు వినిపిస్తున్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కమర్షియల్ గా సక్సెస్ అందుకుంటాడా?

నిజానికి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్నప్పటికీ హీరోల స్టేటస్ కంటే కథను ఎక్కువగా నమ్మే దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు క్రిష్. అలాంటిది ఇప్పుడు స్టార్ హోదాను పక్కనపెట్టి ఓన్లీ కొత్త వాళ్ళతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈసారి కూడా కథను ప్రాధాన్యంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంటారా? లేక ఎప్పటిలాగే పేరు మాత్రమే వస్తుందా ?అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా క్రిష్ జాగర్లమూడి కథను నమ్ముకుని సినిమాలు చేస్తూ ఇటు కమర్షియల్ గా కూడా సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News