కొత్తలోక ఓటీటీ స్ట్రీమింగ్ పై వీడని మిస్టరీ.. నిన్న నెట్ ఫ్లిక్స్.. నేడు?

కానీ కొంతమంది మాత్రం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై పలు రకాల ఫ్లాట్ ఫామ్ పేర్లను తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-01 12:24 GMT

లోక చాప్టర్ 1: చంద్ర.. మలయాళం సినిమాగా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించింది. 'కొత్తలోక' అనే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా ఊహించని కలెక్షన్లను అందించి.. నిర్మాతలను లాభాల్లో ముంచేసింది. అంతేకాదు ఇండియాలోనే మొట్టమొదటి లేడీ సూపర్ హీరో చిత్రం కూడా.. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో.. నస్లేన్ కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 28న మలయాళంలో విడుదల కాగా.. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 29న తెలుగులో విడుదలయ్యింది.

ఓటీటీ స్ట్రీమింగ్ పై స్పందించని యూనిట్..

ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి రాదు అని , దుల్కర్ సల్మాన్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా థియేటర్లలోకి ఎన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినిమాకి మాత్రం ప్రేక్షక ఆదరణ తగ్గడం లేదు.. దీనికి తోడు దసరా సెలవులు కూడా రావడంతో ఇంకొన్ని రోజులు థియేటర్లలోనే కొనసాగించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంకా అధికారిక ప్రకటన చిత్ర బృందం నుండి వెలువడలేదు అని సమాచారం.

ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై ఆగని రూమర్స్..

కానీ కొంతమంది మాత్రం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై పలు రకాల ఫ్లాట్ ఫామ్ పేర్లను తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ వేదికగా కొత్తలోక స్ట్రీమింగ్ అవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని.. ఇప్పుడు జియో హాట్ స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని.. త్వరలోనే జియో హాట్ స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందంటూ.. మాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కూడా చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఇది కూడా రూమర్ గానే మిగిలిపోతుందేమో చూడాలి. నిత్యం రూమర్స్ వెలువడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే వరకు ఎవరు నమ్మకండి అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

కొత్తలోక సినిమా స్టోరీ

కొత్తలోక సినిమా స్టోరీ విషయానికి వస్తే.. చంద్ర (కళ్యాణి ప్రియదర్శన్) కి సూపర్ పవర్స్ ఉంటాయి. అయితే ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఒకానొక సందర్భంలో ఆమె తన అతీంద్రియ శక్తుల్ని దాచిపెట్టి, బెంగళూరుకు వచ్చి ఒక సాధారణ అమ్మాయిలా బ్రతుకుతూ ఉంటుంది. కేఫ్ లో పనిచేసే ఈమెకు ఎదురింటిలో సన్నీ(నస్లేన్ )ఫ్రెండ్స్ తో కలిసి నివసిస్తూ ఉంటాడు. చంద్రని చూసి సన్నీ ఇష్టపడతాడు. ఇక పరిస్థితులు కలిసొచ్చే ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అయితే ఒక రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం పూర్తిగా తలకిందుల అవుతుంది. దాంతో చంద్ర ఎవరు? ఆమె గతం ఏంటి ? తర్వాత ఏర్పడిన పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంది? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News