వరుణ్ తేజ్ ఈసారి హిట్ ఖాయం?.. సెన్సార్ టాక్ ఏమంటోంది!

ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న 'కొరియన్ కనకరాజు' మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2026-08-05 09:29 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’ సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. 2 గంటల 36 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి మంచి స్పందన వచ్చింది. అనంతపురం కుర్రాడిగా, కొరియన్ మాఫియా డాన్‌గా వరుణ్ తేజ్ నటన, ఆయనతో కమెడియన్ సత్య కామెడీ టైమింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్స్‌గా నిలవనున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

సెన్సార్ పూర్తి.. బ్లాక్‌బస్టర్ వైబ్స్:

ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న 'కొరియన్ కనకరాజు' మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సెన్సార్ పనులను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక బోర్ కొట్టకుండా మొదటి సన్నివేశం నుండి చివరి వరకు ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ థ్రిల్ ఇచ్చేలా స్క్రీన్‌ప్లే ఉందట. ఈ సినిమాకి సెన్సార్ నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో చిత్రబృందం ఎంతో సంతోషంలో ఉంది.

వరుణ్ డ్యూయల్ షేడ్స్ అండ్ సత్య కామెడీ:

ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇక రాయలసీమ యాసలో మాట్లాడే అనంతపురం కుర్రాడిగా, అలాగే స్టైలిష్ కొరియన్ గ్యాంగ్‌స్టర్‌గా ఆయన నటన మెప్పిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లో వరుణ్ తేజ్, కమెడియన్ సత్య కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతున్నారు. సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో వరుణ్ చేసిన ఈ ప్రయోగం ఆయన కెరీర్‌కు మంచి ప్లస్ కానుంది.

సీమ కారం వర్సెస్ కొరియన్ కిమ్‌చి:

'సీమ కారం వర్సెస్ కొరియన్ కిమ్‌చి' బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న క్రాస్ కల్చరల్ ఎలిమెంట్స్, హారర్ అండ్ కామెడీ ట్విస్టులు సినిమాకు అసలైన బలంగా నిలిచాయి. దర్శకుడి రైటింగ్, స్క్రీన్‌ప్లే ప్రతీ సన్నివేశంలోనూ కనిపిస్తుందని టాక్. ఇక దానికి తోడు తమన్ అందించిన మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. విజువల్స్, డైలాగ్స్ కూడా సినిమా రేంజ్‌ను మరింత పెంచాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

వరుస విజయాల కోసం చూస్తున్న వరుణ్ తేజ్‌కు 'కొరియన్ కనకరాజు' పక్కా హిట్ ఇస్తుందని సెన్సార్ టాక్ స్పష్టం చేస్తోంది. ఇక 2 గంటల 36 నిమిషాల క్రిస్ప్ రన్‌టైమ్, సత్య కామెడీ, తమన్ ఆర్ఆర్, మేర్లపాక గాంధీ మార్క్ మార్క్ డైరెక్షన్ అన్నీ తోడవ్వడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందని మెగా అభిమానులు, సినీ విశ్లేషకులు ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News