దేవర కొరటాలకు.. ఆ ఛాన్స్ ఉంటుందా..?

దేవర 2 విషయంలో ఏదో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఐతే కొరటాల శివ దేవర ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాడు.;

Update: 2026-01-26 13:30 GMT

ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసిన కొరటాల శివ ఆ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడని తెలుస్తుంది. దేవర విషయంలో ఎన్టీఆర్ ఫైనల్ కాల్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. కొన్నాళ్లు సీక్వెల్ ఉంటుందని అంటుంటే.. తారక్ అంత సాటిస్ఫైడ్ గా లేడు సినిమా ఆగిపోతుందని అంటున్నారు. దేవర 2 విషయంలో ఏదో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఐతే కొరటాల శివ దేవర ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాడు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్..

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక దేవర 2 ఉంటే దాన్ని చేస్తాడు. ఈలోగా కొరటాల శివ దేవర 2 కి సంబంధించిన వర్క్ చేయాల్సి ఉంది. ఐతే ఈలోగా కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో సినిమా చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సంక్రాంతికి వచ్చిన మన శంకర వర ప్రసాద్ లో కూడా తన రోల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు వెంకటేష్.

ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత మళ్లీ అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనే వెంకటేష్ సినిమా చేస్తాడని టాక్. వెంకటేష్, రానా మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఐతే వెంకటేష్ ఆ సినిమా కమిటైతే కొరటాల శివ సినిమా లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

రైటర్ నుంచి డైరెక్టర్ గా కొరటాల శివ..

రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ ఆచార్య ముందు వరకు హిట్లు కొట్టిన కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ ఇవ్వగా దేవర జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. ఐతే దేవర 2 కోసమే రెండేళ్లుగా టైం కేటాయిస్తున్న కొరటాల శివ ఆ సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు. దేవర 2 లేకపోతే మాత్రం కొరటాల శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వాలని చూస్తున్నాడు.

వెంకటేష్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కథ నచ్చితే కొరటాల శివ ఫ్లాప్ ల గురించి వెంకటేష్ పట్టించుకునే ఛాన్స్ లేదు. డైరెక్టర్ గా తన మార్క్ చూపించిన కొరటాల మళ్లీ బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు. మరి అది ఏ సినిమాతో అవుతుందో చూడాలి. వెంకటేష్, ఎన్టీఆర్ తో పాటు కొరటాల మరో ఇద్దరు హీరోలతో కూడా టచ్ లో ఉన్నాడని టాక్. మొత్తానికి కొరటాల శివ ఈ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టి తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

Tags:    

Similar News