• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో కొడుకుతో...

స్టార్ హీరో కొడుకుతో కొరటాల సినిమా?

| దీని తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-11-09 12:48 GMT

రైటర్ గా మంచి పేరు తెచ్చుకుని, మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారిన వారిలో కొరటాల శివ ఒకరు. ఎన్నో హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన.. అనతి కాలంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయారు. కమర్షియల్ సినిమాలకు తనదైన శైలిలో సందేశాన్ని జోడిస్తూ, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ వచ్చారు. 'ఆచార్య'తో భారీ డిజాస్టర్ అందుకొని, ఇప్పుడు 'దేవర' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ స్టార్ హీరోలతో మాత్రమే వర్క్ చేసిన కొరటాల.. త్వరలో ఓ యంగ్ హీరోతో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

 

'దేవర 1' సినిమాతో సూపర్ హిట్ సాధించిన కొరటాల శివ.. ప్రస్తుతం ఆ సక్సెస్ జోష్ లో 'దేవర' పార్ట్-2 కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొరటాల దగ్గర ఓ బ్యూటిఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఉందని, ఆ కథను నట వారసుడితో చేసే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

చైల్డ్ ఆర్టిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రణవ్ మోహన్ లాల్.. ఆ తర్వాత రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. 2018లో 'ఆది' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 'హృదయం' మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రణవ్ త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో కొరటాల డైరెక్ట్ చేసిన 'జనతా గ్యారేజ్' సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మోహన్ లాల్ తో ఉన్న పరిచయంతోనే ఆయన కుమారుడితో కొరటాల శివ సినిమా చేయడానికి అంగీకరించారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ, ఒకవేళ ఈ వార్త నిజమే అయినా ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కొరటాల ఫోకస్ అంతా 'దేవర 2' సినిమాపైనే ఉంది. స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తవుతుందో, సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇప్పుడప్పుడే చెప్పలేం. కాబట్టి కొరటాల తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తొందర అవుతుంది.

'మిర్చి' మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన కొరటాల శివ.. 'శ్రీమంతుడు' 'జనతా గ్యారేజ్' 'భరత్ అనే నేను' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. అయితే 'ఆచార్య' చిత్రం ఆయన స్పీడ్ కు బ్రేక్ వేసింది. మెగా తండ్రీకొడుకులతో తీసిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. కొరటాలను ఆర్థికంగా దెబ్బతీయడమే కాదు, కావాల్సినంత నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో దర్శకుడు కాస్త గ్యాప్ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ తో 'దేవర' సినిమా చేసారు. సెప్టెంబర్ నెలాఖరున వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల క్లబ్ లో చేరడంతో కొరటాల మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చారు. లేటెస్టుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసిన 'దేవర 1' చిత్రానికి డిజిటల్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.

Tags:    
  • Koratalasiva 
  • Mohanlal 
  • Pranavmohanlal 
  • Hridayammovie 
  • Filmindustry 
  • Devaramovie 
  • NTR 
  • Mohanlalpranavmovie 

Similar News

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

కొత్త సమస్యలో చిక్కుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

2026-11-17 10:20 GMT

నెపోటిజం విమర్శలపై అనన్య పాండే స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-17 10:20 GMT

అప్ కమింగ్ హీరోలకు స్టోరీ సెలెక్షన్ తెలియడం లేదా?

2026-11-17 10:19 GMT

జానీ మూవీ అందరికీ నచ్చుతుంది కానీ ప్లాప్ అవ్వడానికి కారణం ఇదే...

2026-11-17 10:13 GMT

సాయిపల్లవి vs శ్రీలీల.. డ్యాన్స్‌లో ఎవరు ఇరగదీసారంటే..!

2026-11-17 10:12 GMT

పాత చింతకాయ కథలపై తాప్సీ పన్ను అసహనం!

2026-11-17 10:04 GMT

సాయి పల్లవి హెయిర్ కట్ వెనుక అసలు కథ.. అతని కోసమే అలా చేసిందంట..!

2026-11-17 10:04 GMT

Copyright @2026

Powered by Blink CMS