పెద్ద తోపు హీరోల పొజిషన్ కొట్టేస్తున్నాడు!
అతడు ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటూనే సక్సెస్ ని ఒడిసిపట్టుకున్నాడు. గడిచిన రెండేళ్లుగా స్థిరంగా విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.;
దాదాపు ఐదారేళ్ల క్రితం తన సినిమా తెలుగు అనువాదం విడుదల కోసం హైదరాబాద్ తాజ్ కృష్ణలో ప్రెస్ మీట్ కి వచ్చేసిన ఒక ప్రముఖ హీరోని ''ఈయనేమి హీరో'' అని కామెంట్ చేసింది తెలుగు మీడియా. అతడికి ఛామ్ గ్లామ్ లేదు. ప్రతిభ ఎలాంటిదో ఎవరికీ తెలీదు. కట్ చేస్తే, ఇప్పుడు అదే హీరో తమిళనాడులో ఇండస్ట్రీని శాసించే హీరోగా ఎదిగాడు. సినీపరిశ్రమలో ఛామ్, గ్లామ్ కంటే ప్రతిభ చాలా ముఖ్యమని అతడు నిరూపించాడు. ఆరోజు అతడిని తక్కువ చేసి చూసిన మీడియానే ఈరోజుల్లో ఇంటర్వ్యూల కోసం వెంటపడుతోంది.
అతడు ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటూనే సక్సెస్ ని ఒడిసిపట్టుకున్నాడు. గడిచిన రెండేళ్లుగా స్థిరంగా విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఉన్నట్టుండి తాను నమ్మి చేసిన బయోపిక్ కొండెక్కి కూచుంది. ఈ బయోపిక్ కారణంగా 300కోట్ల క్లబ్ హీరోగా ఎదిగాడు. అతడు తన ఛామ్ ని గ్లామ్ ని నమ్ముకోకుండా ప్రతిభను, పట్టుదల కృషిని, అభిరుచితో కూడుకున్న ఎంపికల్ని మాత్రమే నమ్ముకున్నాడు. ఇప్పుడు లక్ కలిసొచ్చింది. దానికి తోడు నిజాయితీగా పనిపై దృష్టి పెట్టే స్వభావం, గొప్ప పరిణతి అతడికి కలిసొస్తున్నాయి.
ఇప్పుడు కోలీవుడ్ నుంచి ఒక పెద్ద హీరో రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాడు. ఇక సినిమాల్లో నటించడం అనుమానమే. తెలుగులోను తోపు మార్కెట్ ఉందని చెప్పుకున్న చాలా మంది తమిళ హీరోలు ఇక్కడ ఆశించినది సాధించలేక చతికిలబడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ హీరో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను దూసుకెళుతున్నాడు. నెమ్మదిగా క్రేజ్ ను పెంచుకోవడంలో సక్సెసవుతున్నాడు.
చూస్తుంటే కోలీవుడ్ లో పెద్ద హీరోల పొజిషన్ అతడు కొట్టేస్తున్నట్టే కనిపిస్తోంది. రాబోవు సంక్రాంతి బరిలో ఇప్పుడు అతడు ఫేవరెట్ గా మారాడు. రాజకీయాల్లోకి వెళ్లిపోతున్న పెద్ద హీరోతో సంక్రాంతి పండక్కి పోటీకి దిగుతుండడం హాట్ టాపిగ్గా మారింది. ఇదే సీజన్ లో తెలుగులో తోపు మార్కెట్ ఉందనుకున్న హీరోలు కూడా పోటీపడటానికి ఆస్కారం ఉంది. 2026 సంక్రాంతి ముక్కోణపు పోటీలో కూడా అతడే ప్రభావం చూపుతాడని నమ్ముతున్నారు. అతడు నటించిన పీరియాడికల్ వారియర్ సినిమా పోటీలో అందరినీ డామినేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఒకప్పుడు అంతగా పట్టించుకోని ఒక యావరేజ్ రొటీన్ హీరో, ఇప్పుడు తోపులాంటి పెద్ద హీరోల్ని పక్కకు నెట్టేయడమో, గెంటేయడమో, సైడ్ వేసేయడమో .. వింటుంటేనే క్రేజీగా ఉంది కదా!