అక్క‌డ నెంబ‌ర్ వ‌న్ ఇంకా ఖాళీగానే!

కోలీవుడ్ లో నెంబ‌వ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అంటే ఆ స్థానం ఇంకా ఖాళీగానే ఉంది. ఒక‌ప్ప‌డు శంక‌ర్-మ‌ణి ర‌త్నం మ‌ధ్య పోటీ క‌నిపించేది.;

Update: 2025-06-15 21:30 GMT

కోలీవుడ్ లో నెంబ‌వ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అంటే ఆ స్థానం ఇంకా ఖాళీగానే ఉంది. ఒక‌ప్ప‌డు శంక‌ర్-మ‌ణి ర‌త్నం మ‌ధ్య పోటీ క‌నిపించేది. కానీ కొంత కాలంగా వాళ్లిద్ద‌రు తీస్తోన్న సినిమాలు పెద్ద‌గా ఆడ‌టం లేదు. రెగ్యుల‌ర్ చిత్రాలుగా తేలిపోతున్నాయి. పైగా ఇద్ద‌రిలో ఎవ‌రూ కూడా ఇంత వ‌ర‌కూ 1000 కోట్ల వ‌సూళ్ల సిని మా ఒక్క‌టీ తీయ‌లేదు. ఇద్ద‌రు 600-800 కోట్ల మ‌ధ్య వ‌సూళ్ల సినిమాలే తీసారు.

అయితే మ‌ణిర‌త్నం కంటే శంక‌ర్ ఇంకాస్త మెరుగ్గా ఉన్నారు. 'రోబో', '2.0' లాంటి సినిమాలు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌కు ఎన‌లేని గుర్తింపును తీసుకొచ్చిన‌ సంగ‌తి తెలిసిందే. 'పొన్నియ‌న్ సెల్వ‌న్' లాంటి సినిమాతో గొప్ప చిత్రాన్ని తెర‌కెక్కించిన ఘ‌న‌త మ‌ణ‌ర‌త్నంకి ద‌క్కింది. డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి చేపట్టిన చిత్ర‌మిది. ఆ త‌ర్వాత త‌రం జ‌న‌రేష‌న్ లో నెల్స‌న్ దిలీప్ కుమార్, లోకేష్ క‌న‌గరాజ్, అట్లీ, హోచ్ .వినోధ్, ఆధిక్ ర‌విచంద్ర‌న్ లాంటి డైరెక్ట‌ర్లు బాగా ఫేమ‌స్ అయ్యారు.

ప్ర‌స్తుతం కోలీవుడ్ లోఈ ఐదుగురి మ‌ధ్య మంచి పోటీ ఉంది. నెల్స‌న్, లోకేష్‌, అట్లీ పోటా పోటీగా ఉన్నారు. ముగ్గురు చిత్రాల‌కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.  'జైల‌ర్' తో నెల్స‌న్ కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా 600 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అలాగే లోకేష్ తెర‌కెక్కించిన 'విక్ర‌మ్', 'లియో' లాంటి సినిమాలు కూడా 600 కోట్ల‌కు పైగా సాధించాయి. అయితే వీరిద్ద‌రి కంటే మెరుగైన స్థానంలో అట్లీ క‌నిపి స్తున్నాడు.

అట్లీ తెర‌కెక్కించిన 'జ‌వాన్' ఏకంగా 1000 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అయితే ఇది షారుక్ ఖాన్ హీరోగా న‌టించిన హిందీ చిత్రం కావ‌డంతో? అట్లీ లోక‌ల్ గా ఫేమ‌స్ కాలేక‌పోయాడు. అదే హిట్ సొంత భాష‌కు చెందిన హీరోకి ఇచ్చి ఉంటే? అట్లీ పేరు కోలీవుడ్ లో మారు మ్రోగిపోయేది. మిగ‌తా ఇద్దరికీ మేక‌ర్స్ గా మంచి పేరుంది.

Tags:    

Similar News