• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: ముగ్గురు...

ట్రైలర్ టాక్: ముగ్గురు మిత్రుల 'కిస్మత్'..

| ఇటీవలే రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By - Tupaki Desk
Update: 2024-01-27 16:42 GMT

ఈమధ్య ఫ్రెండ్ షిప్ స్టోరీలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. నలుగురు, ముగ్గురు ఫ్రెండ్స్.. వారి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకులు కథలు అల్లి.. ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. కుర్రాళ్లు.. వారిలో తమను తాము చూసుకుంటూ సినిమాలను హిట్ చేసేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటి మూవీనే మరొకటి రిలీజ్ కు సిద్ధమైంది.. అదే కిస్మత్.


నరేశ్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రియా సుమన్ హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత దిల్రాజు లాంఛ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.

కిస్మత్ సినిమా ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ముగ్గురి స్నేహితుల జర్నీని చాలా హిలేరియస్ గా దర్శకుడు ప్రజెంట్ చేశారని అంటున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ ముగ్గురి 'కిస్మత్' సిటీకి వెళ్లిన తర్వాత ఎలా మారిందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. హీరోలకు రూ.10 లక్షలు దొరికాక 'డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని దాచుకోవడం అంత కంటే కష్టం' అంటూ అజయ్ ఘోష్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉందని అంటున్నారు. ఆ తర్వాత వచ్చిన సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయని చెబుతున్నారు.

నరేష్ అగస్త్య, విశ్వదేవ్, అభినవ్.. ఈ ముగ్గురి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్ గా ఉంది. ముగ్గురూ మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వండర్ ఫుల్ టైమింగ్ తో వారు చెప్పిన చిన్న చిన్న డైలాగ్స్ వినోదాన్ని పంచాయి. హీరోయిన్ రియా సుమన్ తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది. అందరినీ అలరించే కామెడీ ఎంటర్టైనర్ ను డైరెక్టర్ శ్రీనాథ్ అందించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

వేదరామన్ శంకరన్ అందించిన విజువల్స్, మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం ట్రైలర్ కు మరింత ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ట్రైలర్ కిస్మత్ మూవీపై క్యూరియాసిటీని పెంచింది. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రొడ్యూసర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Full View
Tags:    
  • Kismat 
  • Kismattrailer 
  • Nareshagastya 
  • Abhinavgomatham 
  • Vishwadev 
  • Avasaralasrinivas 
  • Riyasuman 
  • Ajayghosh 
  • Srinathbadineni 
  • Dilraju 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS