బెల్లంకొండ ఆవేదన రైటే.. కానీ పోటీ తప్పదు!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-08 11:13 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. హారర్ జోనర్ లో చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కిస్తున్న ఆ మూవీలో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది.

అయితే సోలోగా మూవీని రిలీజ్ చేయాలనే ఆలోచనతో కిష్కింధపురి మేకర్స్.. చాలా రోజుల క్రితమే విడుదల తేదీని అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో తమ సినిమాను సింగిల్ గా రిలీజ్ చేస్తామనుకున్నారు. కానీ ఇంతలో మరో యంగ్ హీరో తేజ సజ్జా మిరాయ్ కూడా అదే డేట్ న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

నిజానికి.. మిరాయ్ సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది. అందుకే కిష్కింధపురి మేకర్స్ వారం గ్యాప్ లో సెప్టెంబర్ 12వ తేదీని ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు మిరాయ్ తో పోటీ పడాల్సి వస్తుంది. దీంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడనుంది. అయితే కిష్కింధపురి మేకర్స్ మాత్రం తమకు చెప్పకుండా మిరాయ్ వాళ్లు డేట్ అనౌన్స్ చేశారని అంటున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ కూడా రీసెంట్ గా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆవేదన చెందడం రైటే కానీ అన్ని విధాల ఆలోచించాలి. ఎందుకంటే మిరాయ్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ అక్కడి వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ.. 25వ తేదీన రిలీజ్ కానుంది. అందుకే 12వ తేదీని ఎంచుకున్నట్లు ఉన్నారు.

అయితే కిష్కింధపురి మేకర్స్ ప్లాన్ తో సోలోగా ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు మిరాయ్ వల్ల ఓపెనింగ్స్ విషయంలో దెబ్బతినే అవకాశం ఉంది. అది ఎవరూ ఏం చేయాలని పరిస్థితి. అయితే కంటెంట్ బాగుంటే ఓపెనింగ్స్ తగ్గినా.. తర్వాత మాత్రం దూసుకుపోవడం పక్కా. కంటెంట్ సూపర్ గా ఉంటే ఎంత పోటీ ఉన్నా కూడా ఇబ్బంది లేదు.

అదే సమయంలో జోనర్స్ పరంగా చూసుకుంటే మిరాయ్ కు కాస్త బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఫాంటసీ జానర్ కాస్త ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతారు. కిష్కింధపురి హారర్ జానర్ కాబట్టి పరిమిత ఆడియన్స్ ఉంటారు. ఏదేమైనా అన్ని విధాలుగా ఆలోచిస్తే కిష్కింధపురికి పోటీ తప్పదు. మరి సినిమా ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News