కిరణ్ అబ్బవరం.. భలే లైనప్

‘రాజావారు రాణివారు’ అనే లవ్ స్టోరీతో నటుడిగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం మీద ఆ సినిమా రిలీజైనపుడు ఎలాంటి అంచనాలు లేవు.

Update: 2026-07-15 09:53 GMT

బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలో ఎదగడం అంత తేలిక కాదు. ముఖ్యంగా హీరోగా నిలదొక్కుకోవడం, స్టార్ ఇమేజ్ సంపాదించడం మరీ కష్టం. చాలా కొద్దిమంది మాత్రమే ఈ జాబితాలో ఉంటారు. ‘రాజావారు రాణివారు’ అనే లవ్ స్టోరీతో నటుడిగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం మీద ఆ సినిమా రిలీజైనపుడు ఎలాంటి అంచనాలు లేవు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ చిత్రం.. ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుంది.

తర్వాత కిరణ్ నటించిన రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కొవిడ్ టైంలో రిలీజై మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని కిరణ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో అతడికి అవకాశాలు వరుస కట్టాయి. ఐతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే చందాన హడావుడిగా చేసిన సినిమాలు కిరణ్ కెరీర్‌ను దెబ్బ కొట్టాయి. దీంతో అతడికి జ్ఞానోదయం అయింది. తర్వాత జాగ్రత్తగా సినిమాలు చేశాడు. ఈ క్రమంలోనే క, కే ర్యాంప్ లాంటి సూపర్ హిట్లు పడ్డాయి. దీంతో కిరణ్ రేంజ్ మారిపోయింది.

ఇప్పుడు కిరణ్ నుంచి రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ రూ.35 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అనే అంచనాలున్నాయి. మరోవైపు భరత్ కమ్మతో కలిసి అమేజాన్ ప్రైమ్ కోసం ‘గువ్వలచెరువు ఘాట్’ అనే వెబ్ మూవీ చేశాడు కిరణ్. దాని మీదా మంచి అంచనాలుండగా.. స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను ఇటీవలే మొదలుపెట్టాడు కిరణ్. ఇది కాక సుకుమార్ శిష్యుడు వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ చేయబోతున్న సినిమా గురించి ఇండస్ట్రీలో ఆల్రెడీ డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం రాయలసీమ బ్యాక్ డ్రాప్ అన్నది ఇండస్ట్రీలో సక్సెస్ సెంటిమెంట్‌గా మారింది. మా ఇంటి బంగారం, లెనిన్ పెద్ద హిట్లవడంతో ఈ నేపథ్యానికి క్రేజ్ పెరిగింది.

కిరణ్, వీర సినిమా బ్యాక్ డ్రాప్ రాయలసీమే. కర్నూలు నగరంలో సాగే థ్రిల్లర్ కథ ఇది. సుకుమార్ ఓకే చేసిన స్క్రిప్టు కావడం, ఆయన నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించనుండడంతో ఇది కిరణ్‌కు మరో మంచి హిట్ అవుతుందనే అంచనాలున్నాయి. సుకుమార్ అన్న కొడుకు అశోక్, యువ నిర్మాత వంశీ నందిపాటి కలిసి నిర్మించే ఈ చిత్రం సెప్టెంబరు చివరి వారంలో సెట్స్ మీదికి వెళ్లనుంది. బుధవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న కిరణ్.. రాబ్ోయే ఏడాది కాలంలో క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

Tags:    

Similar News