అబ్బవరం ప్రొడక్షన్.. తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ ఎలా ఉందంటే?

ట్రైలర్ లోని విజువల్స్‌, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌, క్యారక్టరైజేషన్ అన్నీ కలిపి ప్రేక్షకులను 90స్ టైమ్ కు తీసుకెళ్లేలా ఉన్నాయి.;

Update: 2026-04-09 14:01 GMT

టాలీవుడ్ లో హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నిర్మాతగా తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం రూపొందిస్తున్నారు. ఆ మూవీ ట్రైలర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తిగా కొత్త నటీనటులతో, విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న సినిమాపై ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పాలి.

సినిమాతో సాయి తేజ్ పులుల, వేదశ్రీ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతుండగా, మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో, ముఖ్యంగా 1990ల కాలాన్ని ప్రతిబింబించేలా ఆ సినిమాను రూపొందిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటనలు, అక్కడ మనుషుల ఎమోషన్స్ ను కథగా మలిచినట్లు ట్రైలర్ చూస్తే క్లియర్ గా తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 9న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ ను విడుదల చేసింది. "వచ్చే శివరాత్రిలోగా తిమ్మరాజుపల్లి టీవీ ఊపు, ఊరు, ఉగ్రం అన్నీ ఒకే ప్యాక్‌ లో వస్తాయి" అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ట్రైలర్‌ ను పరిశీలిస్తే.. టీవీ అనే టెక్నాలజీ గురించి కూడా తెలియని ఒక గ్రామంలోకి ఒక యువకుడు టీవీ తీసుకురావడం కథకు కీలకంగా మారింది. ఆ ఒక్క టీవీ చుట్టూ గ్రామస్తుల మధ్య ప్రారంభమైన చిన్నపాటి విభేదాలు, క్రమంగా పెద్ద ఘర్షణలకు దారి తీసిన విధానం కథలో ప్రధానంగా కనిపిస్తోంది. టీవీ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోరు, దాని వల్ల ఊరిలో ఏర్పడిన పరిస్థితులు కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చుతాయి.

ట్రైలర్ లోని విజువల్స్‌, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌, క్యారక్టరైజేషన్ అన్నీ కలిపి ప్రేక్షకులను 90స్ టైమ్ కు తీసుకెళ్లేలా ఉన్నాయి. అప్పటి లైఫ్ స్టైల్, విలేజ్ ఎన్విరాన్మెంట్ ను నేచురల్ గా చూపించడంలో చిత్రబృందం సక్సెస్ అయినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మొదట సరదాగా ప్రారంభమైన కథ.. ఆ తర్వాత మలుపులతో ముందుకు సాగడం ఆసక్తిని పెంచుతోంది. డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

ఇక సినిమాతో దాదాపు 25 మంది నటీనటులు టాలీవుడ్‌ కు పరిచయం అవుతున్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నంగా కిరణ్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విలేజ్ రస్టిక్ సస్పెన్స్ డ్రామాగా రూపొందిన ఆ చిత్రం.. కొత్త రకమైన కథతో రానుందని అర్థమవుతోంది. అయితే తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో విజయవంతమైందని చెప్పవచ్చు. మరి మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News