తిమ్మరాజుపల్లి TV.. కిరణ్ అబ్బవరం బ్యానర్‌పై ఓ కొత్త కథ!
ఈ కొత్త ప్రాజెక్ట్ పేరు తిమ్మరాజుపల్లి TV. ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు సాయి తేజ్ అనే యువ నటుడు. గతంలో కిరణ్ అబ్బవరం సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు.;
టాలీవుడ్‌లో కొత్త కథలకు, కొత్త టాలెంట్‌కు సపోర్ట్ చేసే వారి సంఖ్య చాలా తక్కువే. ఇక అలాంటి ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుండే హీరో కిరణ్ అబ్బవరం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంటున్న కిరణ్.. ఇప్పుడు నిర్మాతగా మారి మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ‘కెఎ ప్రొడక్షన్స్’, ‘సుమైర స్టూడియోస్’ బ్యానర్లపై తేజేశ్వర్ రెడ్డి వెల్పుచర్లతో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు.
ఈ కొత్త ప్రాజెక్ట్ పేరు తిమ్మరాజుపల్లి TV. ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు సాయి తేజ్ అనే యువ నటుడు. గతంలో కిరణ్ అబ్బవరం సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు. అలాంటి ఒక టెక్నీషియన్‌ను హీరోగా తీసుకోవడం కిరణ్ గొప్పతనం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా వేదశ్రీ నటిస్తోంది.
ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. సినిమాకి పల్లెటూరి కథతో నడిచే బలమైన నేపథ్యం ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఓ గ్రామీణ యువకుడు బైక్‌పై ఎవ్వరినో చైర్‌లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్న షాట్, బ్యాక్‌డ్రాప్‌లో బొబ్బిలి సింహం కటౌట్, శాటిలైట్ డిష్ వంటి డీటెయిల్స్ ఈ చిత్రానికి నేటివిటీ ఎంత ఉండబోతుందో చెబుతున్నాయి. కుప్పంలో జరిగే ఓ వినూత్న కథతో ఈ సినిమా వస్తుందని సమాచారం.
దర్శకుడిగా మునిరాజు పరిచయం అవుతున్నారు. గతంలో ఆన్‌లైన్ ఎడిటర్‌గా ఇండస్ట్రీలో పనిచేసిన మునిరాజుకు ఇదే ఫస్ట్ సినిమా. కేవలం నటీనటులే కాకుండా టెక్నీషియన్‌గా కూడా కొత్తవారికే అవకాశం ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ అక్షయ్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్ వంటి టెక్నీషియన్‌లు కూడా కొత్తవారే.
లతిష్ కీలపట్టు, రాజశ్రీ మడకా, మధన్, అంషుమన్, రఘురామవాసి, బాలరాజు పులుసు లాంటి నటులు ఈ సినిమాకు ప్రధాన బలంగా మారనున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. కథ, సంగీతం, నటనల పరంగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది ఓ సరికొత్త అనుభవాన్ని ఇవ్వనుందనే నమ్మకం కనిపిస్తోంది.
మొత్తానికి ‘థిమ్మరాజుపల్లి TV’ అనే టైటిల్‌తోనే విలేజ్ వాతావరణం హైలెట్ అవుతోంది. కంటెంట్‌కు నమ్మకంతో నిలిచే కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. మంచి కథలతో, కొత్తవారిని ప్రోత్సహించాలన్న అతని అడుగులు ఇంకా ఎంతవరకు వెళతాయో చూడాలి.