అడ్డాల శ్రీకాంత్ తో.. అబ్బవరం కిరణ్..!
టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం నూతన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన కిరణ్ అబ్బవరం తన సత్తా చాటుతున్నాడు.;
టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం నూతన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన కిరణ్ అబ్బవరం తన సత్తా చాటుతున్నాడు. అఫ్కోర్స్ కెరీర్ లో ఎత్తు పల్లాలు కామనే కానీ హీరోగా ఒక ఐడెంటిటీ సంపాదించడంలో సక్సెస్ అయ్యాడు. క ముందు వరకు కిరణ్ పని అయిపోయింది అనుకున్న వారికి క తో షాక్ ఇచ్చాడు. నెక్స్ట్ దిల్ రూబా టార్గెట్ మిస్ అయినా మళ్లీ కె ర్యాంప్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా ఇంప్రెస్ చేసింది.
కొత్త బంగారు లోకం సినిమాతో..
ఇదిలాఉంటే కిరణ్ అబ్బవరం ఒక క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అతను ఒక పాపులర్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడట. అతను ఎవరో కాదు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం సినిమాతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు శ్రీకాంత్ అడ్డాల. అతను లాస్ట్ ఇయర్ పెదకాపు అంటూ ఒక అటెంప్ట్ చేశాడు. కానీ ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
పెదకాపు సక్సెస్ అయ్యుంటే సీన్ వేరేలా ఉండేది కానీ అది ఫ్లాప్ అవ్వడంతో డైలమాలో పడ్డాడు శ్రీకాంత్ అడ్డాల. ఐతే రీసెంట్ గా అతను కిరణ్ అబ్బవరంకు ఒక స్టోరీ చెప్పాడట. ఆ కథ కిరణ్ కి నచ్చడంతో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట. ఈ సినిమాలో రానా కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను రానా కో ప్రొడ్యూస్ చేస్తున్నారని టాక్. సో శ్రీకాంత్ అడ్డాల తో కిరణ్ అబ్బవరం సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.
పెదకాపుతో యాక్షన్ రూట్..
శ్రీకాంత్ అడ్డాల మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్.. ఐతే అంతకుముందు సెన్సిటివ్ సినిమాలు చేసే ఆయన పెదకాపుతో యాక్షన్ రూట్ లోకి వెళ్లాడు. ఆ సినిమాలో ఆయన ఒక రోల్ కూడా చేశాడు. ఐతే ఆ సినిమా వర్క్ కాకపోవడంతో కాస్త వెనకపడ్డాడు. సో ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు శ్రీకాంత్.
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ తో పాటుగా చెన్నై లవ్ స్టోరీ సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ కూడా ఇంప్రెస్ చేసింది. కిరణ్ కె ర్యాంప్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుండగా.. చెన్నై లవ్ స్టోరీలో గౌరి ప్రియ హీరోయిన్ గా నటిస్తుంది.