కిరణ్ అబ్బవరం.. రహస్య కన్నా ముందు లవ్ స్టోరీలు తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రాజావారు రాణిగారు మూవీతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.;

Update: 2025-10-10 13:17 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రాజావారు రాణిగారు మూవీతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్న టైమ్ లో ఫస్ట్ సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ను పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న వారిద్దరూ.. వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా పండంటి మగబిడ్డకు పేరెంట్స్ గా మారారు.

కిరణ్- రహస్య ప్రేమలో ఉన్నట్లు ఎలాంటి వార్తలు గానీ, రూమర్స్ గానీ రాలేదు. అంత సీక్రెట్ గా ప్రేమించుకున్న వారిద్దరూ.. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించి షాక్ అయ్యారు. అయితే రహస్య గోరఖ్ కంటే ముందే మరో ఇద్దరు అమ్మాయిలతో లవ్ లో పడ్డారట కిరణ్ అబ్బవరం. ఆ విషయాన్ని ఆయనే రీసెంట్ గా వెల్లడించారు.

తన అప్ కమింగ్ మూవీ కే- ర్యాంప్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీస్ కోసం మాట్లాడారు. తాను ఇంటర్ వరకు బాయ్స్ స్కూల్, బాయ్స్ కాలేజీలో చదివానని తెలిపారు. ఆ తర్వాత బీటెక్ లో జాయిన్ అయ్యాక అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ టైమ్ లో అమ్మాయిలను చూసేవాడినని చెప్పారు.

అప్పటిదాకా అబ్బాయిల మధ్య చదివి ఒక్కసారిగా అమ్మాయిలు కనపడటంతో అలా చూసేవాడినని అన్నారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చిందని చెప్పారు. దీంతో కనపడిన మొదటి రోజే వెళ్లి ప్రపోజ్ చేయగా ఆమె రిజెక్ట్ చేసిందని తెలిపారు. అయితే రెండేళ్లు గట్టిగా ట్రై చేశానని చెప్పిన కిరణ్ అబ్బవరం.. వర్కౌట్ అవ్వకపోవడంతో వదిలేశానని చెప్పారు.

అయితే తాను వదిలేశాక ఆమెకు తన మీద ఇష్టం కలిగిందని కానీ అప్పుడు లవ్ చేసే మూడ్ లో లేనని అన్నారు. అందుకే నో చెప్పానని తెలిపారు. ఆ తర్వాత తన ఫస్ట్ కిస్ గురించి మాట్లాడారు. బీటెక్ థర్డ్ ఇయర్ లో వేరే అమ్మాయితో ఫస్ట్ కిస్ చేశానని ఓపెన్ గా తెలిపారు. అదే సమయంలో కాలేజీ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీలు ఏమి లేవని చెప్పారు.

ఆ తర్వాత రహస్య తన లైఫ్ లోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే రాజావారు రాణిగారు మూవీ షూటింగ్ టైమ్ లో కిరణ్, రహస్య ప్రేమలో పడ్డారు. కానీ ఎక్కడా ఎలాంటి లీక్ లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. లాస్ట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ను ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. తమ కొడుకు హను అబ్బవరంతో మెమోరబుల్ మూమెంట్స్ ను ఆస్వాదిస్తున్నారు.

Tags:    

Similar News