అబ్బవరం గట్టి సౌండింగ్.. అప్డేట్ ఎప్పుడు..?

టాలీవుడ్ యువ హీరోల్లో సినిమా సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం. అదేంటో అతని సినిమా వస్తుంది అంటే ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ బాగుంటుంది సినిమా చూద్దాం అన్నట్టు సిద్ధం అవుతున్నారు.;

Update: 2025-10-11 05:43 GMT

టాలీవుడ్ యువ హీరోల్లో సినిమా సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం. అదేంటో అతని సినిమా వస్తుంది అంటే ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ బాగుంటుంది సినిమా చూద్దాం అన్నట్టు సిద్ధం అవుతున్నారు. అనతికాలంలోనే ఇలాంటి ఇమేజ్ తెచ్చుకోవడం మంచి విషయమే. ఐతే కిరణ్ అబ్బవరం క ముందు వరకు అందరిలానే వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్లాడు. కానీ ఇప్పుడు తన పంథా మార్చాడని అనిపిస్తుంది. కథ వర్క్ అవుట్ అవుతుంది అన్నప్పుడే దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం కె ర్యాంప్ తో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం.

అనిరుద్ రవిచందర్ మ్యూజిక్..

ఆ సినిమా ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ సినిమా గురించి హింట్ ఇచ్చేశాడు కిరణ్ అబ్బవరం. ఆల్రెడీ సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా చాలా భారీగా ఉండబోతుంది అన్న టాక్ మొదలైంది. ఐతే ఆ సినిమా ఏంటి.. ఆ డైరెక్టర్ ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే లేటెస్ట్ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం ఓపెన్ అయ్యాడు. ఇది చాలా ఎర్లీ కానీ.. అవును పెద్ద సినిమా వస్తుంది.. అంతా సెట్టైంది అని అన్నాడు. అంతేకాదు ఆ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.

తమిళ డైరెక్టర్ తో కిరణ్ అబ్బవరం సినిమా దాదాపు లాక్ అయినట్టే. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీగా ఇది వస్తుందట. ఈ సినిమాను ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని తెలుస్తుంది. ఐతే ఆ డీటైల్స్ త్వరలో వస్తాయని అంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఐతే ఎప్పుడొచ్చినా ఆ సినిమా మాత్రం గట్టి సౌండింగ్ చేస్తుందని అంటున్నారు. కిరణ్ అబ్బవరం తన స్టోరీ సెలక్షన్ డిఫరెంట్ గా చేస్తున్నాడు. క ముందు వరకు ఎలా ఉన్నా ఒక సినిమాను మంచి కథతో సిన్సియర్ ఎఫర్ట్ తో తీస్తే ఆడియన్స్ హిట్ చేస్తారని తెలుసుకున్నాడు.

కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా..

ఆ ప్రకారంగానే తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. అంతేకాదు తమిళ దర్శకుడితో చేస్తున్న సినిమా గురించి కూడా అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. తప్పకుండా కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా అది వస్తుందట. సో కిరణ్ కూడా పర్ఫెక్ట్ స్కెచ్ తోనే వెళ్తున్నాడని చెప్పొచ్చు.

రాజావారు రాణి గారు సినిమాతో పరిచయమైన కిరణ్ అబ్బవరం తొలి సినిమా నుంచి తన ప్రయత్నాలతో ప్రేక్షకులను మెప్పొస్తూనే ఉన్నాడు. ఐతే క తో కెరీర్ ని రీసెట్ చేసుకున్న ఈ యువ హీరో ఇక మీదట తన స్టోరీ సెలక్షన్ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నాడు. కె ర్యాంప్ తర్వాత కూడా వెరైటీ కథలతో తన మార్క్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News