సింపతీ కార్డులు వాడినా.. సినిమాలు ఆడవు: నిర్మాత

నిజానికి ర్యాంప్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజేష్ దండా మాట్లాడుతూ.. తాను బాలయ్య ఫ్యాన్ అంటూ తొడ కొట్టి మరీ సినిమా సక్సెస్ సాధిస్తుందని చెప్పారు.;

Update: 2025-10-16 17:39 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో నటించిన కె ర్యాంప్ మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ అవ్వనుంది. సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించగా.. సాయి కుమార్, నరేష్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.

కె ర్యాంప్ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహించగా.. రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌, హాస్య మూవీస్ బ్యానర్లపై శివ బొమ్మకు, రాజేష్ దండా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సంయుక్తంగా నిర్మించారు. అయితే ఇప్పుడు నిర్మాత రాజేష్ ఓ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

నిజానికి ర్యాంప్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజేష్ దండా మాట్లాడుతూ.. తాను బాలయ్య ఫ్యాన్ అంటూ తొడ కొట్టి మరీ సినిమా సక్సెస్ సాధిస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తొడ కొట్టానని, కానీ తొడలు కొట్టినా.. కన్నీరు పెట్టుకున్నా.. కర్చీఫులు తడిసేలా ఏడిపించినా.. సింపతీ కార్డులు వాడినా.. సినిమాలు ఆడవని అన్నారు.

ఎప్పుడైనా మంచి కంటెంట్ తో మూవీ తీస్తేనే.. జనాలు థియేటర్స్ కు వచ్చి బ్లాక్ బస్టర్ చేస్తారని చెప్పుకొచ్చారు. దీపావళికి థియేటర్స్ లోకి వస్తున్న అన్ని సినిమాలు కూడా మంచిగా ఆడాలని ఆకాంక్షించారు. తెలుసు కదా, మిత్ర మండలి చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నారు. ప్రస్తుతం రాజేష్ దండా కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

రీసెంట్ గా ప్రెస్ మీట్ లో పలు విషయాలు తెలిపారు రాజేష్ దండా. చిత్రంలో కిరణ్ అబ్బవరం కుమార్ అబ్బవరం అనే పాత్రలో నటించారని రివీల్ చేశారు. తాను సినిమా కథ విని ఎక్సైట్ అయ్యానని.. అందుకే నిర్మించానని తెలిపారు. తమ చిత్రానికి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారని, అందుకే మూవీలో ఇబ్బందికరమైన పదాలు ఉన్నాయని కాదని స్పష్టం చేశారు.

కేవలం కొన్ని సీన్స్ వల్ల ఎవరైనా ఆడియన్స్ ప్రేరణ పొందుతారేమోనని ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఏదేమైనా కె-ర్యాంప్ సినిమా కిరణ్ వన్ మ్యాన్ షోలా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ బ్లాస్ట్ అవుతుందని అంచనాలు పెంచారు. ఈ సినిమాతో నిర్మాత శివతో తనకు మంచి ప్రయాణం స్టార్ట్ అయిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా కె ర్యాంప్ ఉంటుందని హామీ ఇచ్చారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.


Full View


Tags:    

Similar News