రెడ్ బికినీతో గుబులు రేపిన కిమ్ శ‌ర్మ‌

వ‌రుస ఎఫైర్లు, డేటింగ్ క‌హానీల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే కిమ్ శ‌ర్మ ఇటీవ‌ల కొంత‌కాలంగా సైలెంట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-02 04:33 GMT

వ‌రుస ఎఫైర్లు, డేటింగ్ క‌హానీల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే కిమ్ శ‌ర్మ ఇటీవ‌ల కొంత‌కాలంగా సైలెంట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ భామ చివ‌రిసారిగా యువ‌హీరో హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణేతో డేటింగ్ చేసిన‌ప్పుడు నిరంత‌రం వార్త‌ల్లో నిలిచింది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో రాణేతో కిమ్ బ్రేక‌ప్ అయింది. అంత‌కుముందు కెన్యాకు చెందిన డ్ర‌గ్ డాన్ అలీపుంజాని పెళ్లాడింద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. కెన్య‌న్ డాన్ తో కిమ్ ఫోటోలు కూడ వెబ్ లో వైర‌ల్ అయ్యాయి. 2017లో ఈ జంట విడిపోయారని వార్త‌లు వ‌చ్చాయి.

జాబితాలో టాప్ సెల‌బ్రిటీలు:

అయితే కిమ్ డేటింగ్ హిస్ట‌రీలో సెన్సేష‌న‌ల్ సెల‌బ్రిటీల‌కు కొద‌వేమీ లేదు. అంత‌కుముందు కిమ్ ప్ర‌ముఖ భార‌త‌ టెన్నిస్ ఆట‌గాడు లియాండ‌ర్ ఫేస్ తో సుదీర్ఘ కాలం డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ లియాండ‌ర్ నుంచి ఈ బ్యూటీ విభేధాల కార‌ణంగా విడిపోయింది. ఈ జంట డేటింగ్, బ్రేక‌ప్ వార్త‌లు నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చాయి. ఇటీవ‌ల‌ కొంత‌కాలంగా కిమ్ శ‌ర్మ అన‌వ‌స‌ర వివాదాల్లోకి రాకుండా స్థ‌బ్ధుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ కి ట్రీటిస్తోంది.

టోన్డ్ ఫిజిక్ తో గుబులు:

తాజాగా కిమ్ షేర్ చేసిన రెడ్ హాట్ బికినీ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. కిమ్ విదేశీ బీచ్ లో మైమ‌రిచి బికినీ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ముఖ్యంగా కిమ్ శ‌ర్మ టోన్డ్ బాడీ, తీర్చిదిద్దిన యాబ్స్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. 45 వ‌య‌సులో ఈ బ్యూటీ ప‌ర్పెక్ట్ ఫిట్ లుక్ యువ‌త‌రం గుండెల్లో గుబులు రేపుతోంది. చూస్తుంటే కిమ్ శ‌ర్మ తిరిగి టాలీవుడ్ బాలీవుడ్ లో బిజీ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఖ‌డ్గంతో టాలీవుడ్ లోను..

కిమ్ శ‌ర్మ టాలీవుడ్ లో ఖ‌డ్గం అనే చిత్రంలో న‌టించింది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌వితేజ‌, శ్రీ‌కాంత్, ప్ర‌కాష్ రాజ్, సోనాలి బింద్రే త‌దిత‌రులు న‌టించారు. ఆంజ‌నేయులు అనే తెలుగు చిత్రంలోను కిమ్ న‌టించింది. బాలీవుడ్ లో ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన కిమ్ శ‌ర్మ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే స‌ర‌స‌న ఓ ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించింది. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమాయ‌ణం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది.

Tags:    

Similar News