అన్నిచోట్ల 'మార్క్‌' క్రియేట్‌ చేసేలా ఉంది..!

కన్నడంలోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా భారీ రిలీజ్‌ కి ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.;

Update: 2025-11-08 06:00 GMT

కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ గత ఏడాది డిసెంబర్‌లో 'మ్యాక్స్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విజయ్‌ కార్తికేయ దర్శకత్వంలో వచ్చిన మ్యాక్స్‌ యాక్షన్‌లో బెస్ట్‌గా నిలిచింది. అంతే కాకుండా 2024లో వచ్చిన బెస్ట్ కమర్షియల్‌ సినిమాల్లో ఒకటిగా మ్యాక్స్ నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌ రిపీట్ కాబోతుంది. ఇప్పటికే విజయ్‌ కార్తికేయ దర్శకత్వంలో సుదీప్‌ కిచ్చా హీరోగా 'మార్క్‌' సినిమా ప్రారంభం అయింది. ఇప్పటికే మార్క్‌ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కిచ్చ సుదీప్‌ సినిమా అనగానే కన్నడ ప్రేక్షకుల్లోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరగుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసం కలిగేలా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ ఉంది.

కిచ్చ సుదీప్ మాక్స్ తరహాలోనే...

ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయిన యాక్షన్ సినిమాల తరహాలోనే సుదీప్ కిచ్చ మార్క్‌ కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని ఇటీవల విడుదలైన ఇంట్రో టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు, సినిమాలో భారీ స్టార్‌ కాస్ట్ ఉండబోతుంది. ఇంట్రో టీజర్‌లో సముద్రంలోని భారీ యాక్షన్ సీన్స్‌, విజువల్స్‌ ఉండబోతున్నాయని ఇంట్రోతోనే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో సుదీప్‌ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటుంది అని టీజర్‌తో మేకర్స్ చెప్పకనే చెప్పారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాలిడ్ యాక్షన్‌ సీన్స్‌ ను ఈ సినిమాలో చూడబోతున్నామని ఇప్పటికే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడంలోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా భారీ రిలీజ్‌ కి ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.

నవీన్‌ చంద్ర విలన్‌గా మార్క్‌...

ఇటీవల రవితేజ మాస్ జాతర సినిమాలో విలన్‌గా నటించి మరోసారి మెప్పించిన నవీన్‌ చంద్ర ఈ సినిమాలోనూ విలన్‌గా కనిపించబోతున్నాడు. మార్క్‌ సినిమాలో నవీన్‌ చంద్ర పాత్ర కచ్చితంగా చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటుంది అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో హీరోగా నటించడం కంటే విలన్‌గా నటించడం ద్వారా నవీన్‌ చంద్ర మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. అందుకే మార్క్ సినిమాలోనూ నవీన్‌ చంద్ర విలన్‌గా నటించడం ద్వారా స్టార్‌డం దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో పెద్ద సినిమాలో నటించడం ద్వారా ఇప్పటికే కోలీవుడ్‌లో నవీన్ చంద్రకి మంచి పేరు ఉంది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో నవీన్‌ చంద్ర పేరు మారుమ్రోగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంట్రో టీజర్‌ చూసిన తర్వాత సుదీప్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌లో మార్క్‌ మూవీ రిలీజ్‌...

కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేయబోతున్నారు. ఒకప్పుడు కన్నడ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ ఉండేది కాదు. కానీ కేజీఎఫ్‌ సినిమా తర్వాత మొత్తం పరిస్థితి మారింది. హిందీ ప్రేక్షకులు, ఇతర భాషల ప్రేక్షకులు కన్నడ సినిమాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కాంతార సినిమా అంతకు మించి అన్నట్లుగా కన్నడ సినిమాను పాన్ ఇండియా మార్కెట్‌ కి చేర్చింది. అందుకే సుదీప్‌ నటిస్తున్న మార్క్‌ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. పాన్‌ ఇండియా మార్కెట్‌లో ఒక మార్క్ క్రియేట్‌ చేసే విధంగా ఈ సినిమా హిట్ కావడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్క్ సినిమాతో సుదీప్‌ పాన్ ఇండియా ప్రేక్షకులకు మరింత చేరువ కావడం ఖాయం.


Full View


Tags:    

Similar News