కియారా మ‌న‌సులో మాట‌..వాళ్ల‌కే ఓటు!

ఈ లోతు అనేది మహిళా ప్రేక్షకులను మాత్రమే కాకుండా? పురుషులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటుందని కియారా తెలిపింది.

Update: 2026-05-18 07:36 GMT

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉత్త‌రాదిన అమ్మ‌డి కెరీర్ దేదీప్య మానగా సాగిపోతుంది. అడ‌పా ద‌డ‌పా తెలుగు సినిమాల్లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. అలాగే గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథా బలం స‌హా న‌ట‌కు ఆస్కారం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ద‌క్కించుకుంది. అయితే సంద‌ర్భాన్ని బ‌ట్టి మహిళాపాత్రల ప్రాధాన్యత వాటి రూపకల్పనలో వ‌స్తోన్న‌ మార్పులపై కియారా ఎల్లప్పుడూ గళాన్ని వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మ‌డు సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం - వారి పాత్రల ప్రాముఖ్యత పై అమ్మ‌డు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

`సినిమాల్లో మహిళా శక్తిని చూడటం ఎంతో ఇష్టం. వెండితెరపై బలమైన మహిళా పాత్రలు ఉన్నప్పుడు అవి కథకు ప్రత్యేకమైన అందాన్ని, నిండుదనాన్ని తీసుకొస్తాయి. కేవలం నాయికగా కనిపించడమే కాకుండా? కథను మలుపు తిప్పే శక్తి ఆ పాత్రలకు ఉన్నప్పుడు నటిగా ఎంతో సంతృప్తిని ఇస్తుంది` అని కియారా తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా కథానాయికల పాత్రల పరిధి పెరగడం పట్ల సంతోషం వ్య‌క్తం చేసింది. అలాగే స్త్రీ పాత్రలతో సినిమాల్లో ఎలాంటి మార్పు వస్తుందనే? అంశంపైనా అమ్మ‌డు స్పంద‌చింది. మహిళా పాత్రలు భావోద్వేగాలకే పరిమితం కాకుండా.. నిర్దిష్టమైన లోతును కథకు జోడిస్తాయంది.

ఈ లోతు అనేది మహిళా ప్రేక్షకులను మాత్రమే కాకుండా? పురుషులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటుందని కియారా తెలిపింది. కొన్ని కథలో స్త్రీ, పురుష పాత్రల్లో సమతుల్యత ఉన్నప్పుడే ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందంది. నేటి తరం చిత్రాల్లో దర్శకులు మహిళల కోణాన్ని.. వారి ఆలోచనలను విభిన్న రకాలుగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని కియారా కొనియాడారు. కేవలం కమర్షియల్ హంగుల కోసమే కాకుండా సమాజంలో మహిళలు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా పాత్రలను డిజైన్ చేయడం శుభపరిణామంగా పేర్కొంది.

నటీమణులు కూడా గ్లామర్ చట్రం నుండి బయటకు వచ్చి విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారంది. ఇది సినిమా ఇండస్ట్రీ ఎదుగు దలకు ఎంతో అవసరమని తెలిపింది. ఇటీవ‌ల లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు స‌రైన గుర్తింపు ద‌క్క‌డం లేద‌ని ప‌లువురు భామ‌లు అభిప్రాయ‌ప‌డుతోన్న వేళ కియారా వ్యాఖ్య‌ల‌కు అలాంటి వారంద‌రికీ మ‌ద్ద‌తుగా నిలిచిన‌ట్లు అయింది. ఇక కియారా అద్వానీ కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే అమ్మ‌డు కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా`షేర్షా`, `జుగ్‌జుగ్ జీయో`, `సత్యప్రేమ్ కీ కథ` వంటి చిత్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉన్న మహిళా పాత్రలలో నటించి మెప్పించింది. క‌మర్శియ‌ల్ క‌థ‌ల్లో న‌టిస్తూనే న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో అవ‌కాశాలు తెలివిగా ఒడిసి ప‌ట్టుకుంటుంది.

Tags:    

Similar News