బిడ్డ‌ను క‌న్న త‌ర్వాత మొద‌టిసారి కియ‌రా ఇలా

తల్లి అయిన తర్వాత కియారా అద్వానీ తొలిసారిగా ఈ రోజు బహిరంగంగా కనిపించింది. ప్ర‌స్తుతం కియ‌రా ఫోటోగ్రాఫ్స్, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.;

Update: 2025-12-08 17:10 GMT

కెరీర్‌, వ్య‌క్తిగత జీవితం.. రెండిటినీ బ్యాలెన్స్ చేసిన తెలివైన న‌టి కియ‌రా అద్వాణీ. బాలీవుడ్ తో పాటు సౌత్ లో అత్యంత వేగంగా న‌టిగా ఎదిగిన కియ‌రా, కేవ‌లం నాలుగైదేళ్ల‌కే స్టార్ హీరోయిన్ గా నిరూపించింది. ఇప్పుడు న‌చ్చిన‌వాడిని పెళ్లాడి, ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా ఏ లోటూ లేకుండా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తోంది.

ఇలాంటి స‌మ‌యంలో కియ‌రా తిరిగి న‌ట‌న‌లోకి వ‌స్తుందా? అంటూ అభిమానులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కియ‌రా సెకండ్ ఇన్నింగ్స్ విష‌యంలో ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం త‌న కుమార్తె కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్న కియ‌రా, ఇప్పుడిప్పుడే నెమ్మ‌దిగా ఆరుబ‌య‌ట‌కు వ‌స్తోంది.

తల్లి అయిన తర్వాత కియారా అద్వానీ తొలిసారిగా ఈ రోజు బహిరంగంగా కనిపించింది. ప్ర‌స్తుతం కియ‌రా ఫోటోగ్రాఫ్స్, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు వీడియోల‌లో ఎప్ప‌టిలాగే కియ‌రా అందంగా, ప్ర‌శాంతంగా క‌నిపించింది. మునుప‌టి కంటే గ్లోతో మెరిసిపోతోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన వీడియో ప్ర‌కారం.. కియారా ఒక కార్యక్రమానికి వచ్చింద‌ని అర్థ‌మ‌వుతోంది. చాలా గ్యాప్ త‌ర్వాత కియ‌రా ఇలా ప‌బ్లిక్ లో క‌నిపించ‌డంతో జ‌నంలో క్యూరియాసిటీ ఎక్కువైంది.

స్టైలిష్ హాఫ్ షోల్డ‌ర్ డెనిమ్ టాప్.. చిరిగిన డెనిమ్ షార్ట్ ధ‌రించిన కియ‌రా చాలా క్యాజువ‌ల్ గా క‌నిపించింది. దుస్తుల ఎంపిక‌లో సౌకర్యం- శైలి రెండిటి న‌డుమా స‌మ‌తుల్య‌త‌ను పాటించింది. కియ‌రాను చూడ‌గానే నెటిజ‌నుల్లో ఉత్సాహం పొంగిపొర్లింది. కొత్త తల్లిని చూడగానే ఎగ్జ‌యిట్ అయ్యామ‌ని అభిమానులు వ్యాఖ్యానించారు. కియ‌రా లుక్ పై ప్రశంసిస్తూ మెసేజ్ లు కూడా వచ్చాయి. కియారా ఎంత రిఫ్రెషింగ్‌గా.. అందంగా ఉందో చాలామంది గుర్తించారు. నెమ్మదిగా ప్రజా జీవితంలోకి తిరిగి వస్తున్నందుకు సంతోషం వ్య‌క్తం చేసారు అభిమానులు.

కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సంవత్సరం జూలైలో ఆడ శిశువును స్వాగతించారు. తమ కుమార్తె పేరు - సరయా మల్హోత్రా అని ప్ర‌క‌టించారు. వారు షేర్ చేసిన‌ ఫోటోల‌లో చిన్నారి పాదాలను ప్ర‌ద‌ర్శించారు. ఇంగ్లీష్ -దేవనాగరి లిపిలో సరయా అనే పేరు వచ్చిందని.. ఇది సరళమైనది, స్వచ్ఛమైనది.. ప్రేమతో నిండిన‌ది అని తెలిపారు.

Tags:    

Similar News